Gaddar Awards: గద్దరన్నకు నిజమైన నివాళి.. నంది అవార్డులు కాదు.. గద్దర్ అవార్డులు..

నంది అవార్డుల స్ధానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఏటా టాలీవుడ్‌లో ప్రతిభ‌ను ప్రోత్సహిస్తూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుల ప్రదానోత్సవం కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ఇటు తెలంగాణ‌లోగానీ.. అటు ఏపీలో గానీ నందులు ఇవ్వడం అన్నదే లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 07:41 PMLast Updated on: Jan 31, 2024 | 7:41 PM

Cm Revanth Reddy Decided To Give Gaddar Awards Instead Of Nandi Awards For Film Awards

Gaddar Awards: తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ పాత్రపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గద్దర్‌కు సరైన గౌరవం దక్కలేదని పదేపదే ఆరోపించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి రాగానే.. ఆయనకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌ మీద గద్దర్ విగ్రహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కార్‌.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డుల స్ధానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది.

YS SHARMILA: భద్రత కల్పించండి.. ఏపీ డీజీపీకి షర్మిల లేఖ

ఏటా టాలీవుడ్‌లో ప్రతిభ‌ను ప్రోత్సహిస్తూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డుల ప్రదానోత్సవం కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ఇటు తెలంగాణ‌లోగానీ.. అటు ఏపీలో గానీ నందులు ఇవ్వడం అన్నదే లేదు. అవార్డులు ఇవ్వాల‌ని ఎన్నోసార్లు.. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేదు. ఐతే ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రేవంత్‌ సిద్ధం అయ్యారు. నంది అవార్డులు కాకుండా.. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రేవంత్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇక అటు ఈ మధ్యే తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌కు చెందిన 24క్రాప్ట్స్ స‌భ్యులు.. రేవంత్‌ను మ‌ర్యాద‌పూర్వకంగా కలిశారు. ఆ తర్వాత సుమారు గంట‌పాటు చిత్ర ప‌రిశ్రమ‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

చిన్న.. పెద్ద సినిమాల విష‌యంలో నిర్మాత‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. టికెట్ ధ‌ర‌లు.. పైర‌సీ వంటి అంశాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. తెలంగాణలో ఉచిత షూటింగ్‌లకు, సింగింల్ విండో అనుమ‌తులు.. మినీ థియేట‌ర్స్.. మా భ‌వనం త‌దిత‌ర‌ల అంశాల‌పై చ‌ర్చ జరిగింది. ఇక తెలంగాణ‌లో నంది అవార్డుల స్థానంలో గ‌ద్దర్ అవార్డుల‌ను ఇస్తే బాగుంటుందన్న అంశం కూడా అప్పుడే చర్చకు వచ్చింది. ఇప్పుడు రేవంత్ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.