కలెక్షన్స్ ఫేక్… కరణ్ జోహార్ బాంబ్

బాలీవుడ్ లో హిట్ సినిమాలను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ ను కరణ్ జోహార్ అమ్మడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చ్హింది అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2024 | 02:17 PMLast Updated on: Oct 25, 2024 | 2:17 PM

Collections Fake Karan Johar Bomb

బాలీవుడ్ లో హిట్ సినిమాలను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ ను కరణ్ జోహార్ అమ్మడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చ్హింది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. టాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ పెడుతున్న కరణ్ జోహార్ ఇంత కీలక టైం లో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం దేవర, జిగ్రా సినిమాలు అంటూ ప్రచారం మొదలయింది. అందులో వాస్తవం లేకపోయినా మెగా ఫ్యాన్స్ మాత్రం దేవర సినిమా కారణంగానే ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ ను అమ్మేశాడు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

కార్పోరేట్ బుకింగ్ కారణంగా కరణ్ జోహార్ కు దాదాపు వంద కోట్ల వరకు నష్టం వచ్చిందని… అందుకే అమ్మేశాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. సీరం సంస్థకు ఇటీవల వెయ్యి కోట్లకు తన షేర్ విక్రయించాడు కరణ్. 50 శాతం షేర్ మాత్రమే అతని వద్ద ఉంది. ఇటు తెలుగు సినిమాల నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుని బాలీవుడ్ లో ప్రమోట్ చేసే ప్లాన్ మొదలుపెట్టాడు. పుష్ప సినిమా హిందీ రైట్స్ కోసం కూడా ట్రై చేసాడు కరణ్. అలాంటి కరణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాము చెప్పేవి అన్నీ అబద్దాలే అంటూ బాంబ్ పేల్చాడు.

బాలీవుడ్‌లో ప్రతిభ ఆధారంగా అవకాశాలు ఇస్తారా? అని ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ ఆయనను ప్రశ్నించగా… అలాంటిది ఏమీ లేదని కరణ్‌ ఆన్సర్ చెప్పాడు. కొన్ని సందర్భాల్లో టాలెంట్‌ కంటే బాక్సాఫీస్‌ సక్సెస్‌, పాపులారిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రతిభ ఉన్న కొంతమందికి సరైన గుర్తింపు దక్కడం లేదని అన్నాడు కరణ్. అలాగే బాక్సాఫీస్‌ కలెక్షన్ లపై కూడా సంచలన కామెంట్స్ చేసాడు. అవన్నీ ఫేక్‌ అని క్లారిటీ ఇచ్చారు కరణ్ జోహార్. సెలబ్రిటీ రివ్యూల్లోనూ నిజాలు ఉండవని అన్నాడు.

‘మేమంతా అబద్థాలు చెబుతాం’ అంటూ వసూళ్ళపై సంచలన కామెంట్స్ చేసాడు. అసలు కరణ్ ఏ సినిమా గురించి ఇలా మాట్లాడి ఉండవచ్చు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆలియాభట్‌ కీ రోల్ లో వాసన్‌ బాల డైరెక్షన్ లో వచ్చిన ‘జిగ్రా’ సినిమాకు కరణ్ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. తెలుగులో మంచి ప్రమోషన్ చేసినా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓ పక్క ఫ్లాప్ తో ఇబ్బంది పడుతుంటే… ‘జిగ్రా’ టీమ్‌ ఫేక్‌ కలెక్షన్స్‌తో ప్రేక్షకులను మోసం చేస్తుందంటూ ‘సవి’ నటి దివ్యాఖోసా సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేసారు. ఈ టైం లో కరణ్ కామెంట్స్ పై పెద్ద చర్చే జరుగుతోంది.