Rashmi Gautam : ఆత్మహత్యకు ప్రయత్నించిన జబర్దస్త్ రష్మీ
హీరోలకే కాదు టెలివిజన్ షోస్ కి కూడా వీరాభిమానులు ఉంటారని నిరూపించిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా అశేష తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన యాంకర్ రష్మీ డైలీ ఆమె పేరు తలవని తెలుగు గడప అంటు లేదంటే అతిశయోక్తి కాదు.

Comedy show Jabardasth has proved that not only heroes but also television shows have fans
హీరోలకే కాదు టెలివిజన్ షోస్ కి కూడా వీరాభిమానులు ఉంటారని నిరూపించిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా అశేష తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన యాంకర్ రష్మీ డైలీ ఆమె పేరు తలవని తెలుగు గడప అంటు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె విషం తగ్గిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.రష్మీ విషం తాగిందనే వార్త తెలుగు ప్రేక్షకులలో కొంత గందరగోళానికి తెరతీస్తోంది. తీరా అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య అంటు ఊపిరి పీల్చుకోవడంతో పాటు జబర్దస్త్ గా నవ్వుకుంటున్నారు.
అసలు విషయం ఏంటంటే లేటెస్ట్ గా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్ ఆటో రామ్ ప్రసాద్ నోటి వెంట రష్మీ సూసైడ్ వార్త వచ్చింది. స్కిట్ లో భాగంగా రామ్ ప్రసాద్ న్యూస్ పేపర్ చదువుతు ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేసారని రష్మీ విషం తాగబోతుంటే అని ఆపి ఆ తర్వాత తన దైన స్టైల్లో పంచు వేసాడు. ఇంతలో రష్మీ ని యాజమాన్యం ఆపి రెండు ఎపిసోడ్లు నువ్వే చేస్తావు అని చెప్పగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది అంటూ చెప్పాడు. దీంతో రష్మీ కూడా అవును అన్నట్టుగా తల ఊపింది
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో రష్మీ ఇప్పుడు సినిమాల్లో కూడా తన సత్తా చాటుతుంది. గుంటూరు టాకీస్, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్, శివ రంజని రాణి గారి బంగ్లా, లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఓ వైపు వెండితెరలపై మరోవైపు బుల్లితెరపై రష్మి జోరు తగ్గడం లేదు.