ప్రభాస్ కంటే లేటుగా వచ్చి… నార్త్ లో మొగుడయ్యేలా ఉన్నాడా…?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పడు రెబల్ స్టార్ ప్రభాస్ నే కంగారు పెట్టించేలా ఉన్నాడా? 5 హిట్లతో పాన్ ఇండియా మార్కెట్ కి కింగ్ అనిపించుకున్న ప్రభాస్ సింహాసనానికి, ఎన్టీఆర్ నిజంగానే ఎసరు పెట్టేలా ఉన్నాడా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పడు రెబల్ స్టార్ ప్రభాస్ నే కంగారు పెట్టించేలా ఉన్నాడా? 5 హిట్లతో పాన్ ఇండియా మార్కెట్ కి కింగ్ అనిపించుకున్న ప్రభాస్ సింహాసనానికి, ఎన్టీఆర్ నిజంగానే ఎసరు పెట్టేలా ఉన్నాడా? ఈ డౌట్లు రావటానికి తన వార్ 2, డ్రాగన్ సినిమాలే కారణం. ఐదు పాన్ ఇండియా హిట్లతో రెబల్ స్టార్ రేంజ్ ఎప్పుడో టచ్ చేయలేని స్థాయికి చేరింది. అలాంటి రెబల్ స్టార్ నే మించేలా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇమేజ్ సడన్ గా మైండ్ బ్లాక్ చేసేలా ఉంది… వార్ 2 మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 1400 కోట్లను చేరటం నిజంగా షాకింగే…విచిత్రం ఏంటంటే ఇంకా డ్రాగన్ సెట్లో అడుగుపెట్టకముందే ఆ మూవీ ఓటీటీ ఆఫర్ 400 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇవేవి అఫీషియల్ కాదు.. అసలు షూటింగే జరక్కుండా ఎవరూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్స్ ఇవ్వరు. కాబట్టి చర్చల దశల్లోనే ఉన్నా, ఈ నెంబర్స్ మాత్రం మతిపోగొట్టేలా ఉన్నాయి. ప్రభాస్ తో పోలిస్తే, ఎన్టీఆర్ ఎంచుకున్న దారి కాస్త భిన్నంగా ఉంది. అదే పాన్ ఇండియా లెవల్లో తన క్రేజ్, ఇమేజ్ నే కాదు మార్కెట్ లో స్టామినాని కూడా పెంచేస్తున్నట్టుంది. వార్ 2 సినిమా చేయకపోతే, తను కూడా ప్రభాస్ లానే మిగిలిపోయేవాడు… వార్2 నిర్ణయమే తన ఫేట్ ని మార్చేలా ఉందా? ఆ మూవీ ఇంకా రాకముందే, ఈ రేంజ్ డిస్కర్షన్ కి రీజనేంటి? టేకేలుక్
రెబల్ స్టార్ ప్రభాస్ కి పాన్ ఇండియా లెవల్లో బాహుబలి రెండు భాగాలు, సాహో, సలార్, కల్కీ 2 మొత్తంగా 5 పాన్ ఇండియా హిట్లొచ్చాయి. అన్ని వసూళ్లు కలిపి 5 వేల కోట్లు దాటాయి… అందుకే తనని పాన్ ఇండియా కింగ్ అన్నారు. అలాంటి కింగ్ సింహాసనాన్ని సింపుల్ గా లాగేసుకునేలా ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. తనకి కేవలం రెండంటే రెండే పాన్ ఇండియా హిట్లొచ్చాయి…అందులో ఒకటి మల్టీస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్… రెండో ది సోలో హిట్ దేవర.. ఒకటి 1350 కోట్లు రాబడితే, దేవర 670 కోట్లు రాబట్టింది. రెండు కలిపినా 2 వేల కోట్ల వసూళ్లే వచ్చినట్టు… అలాంటి తను అలా ఎలా రెబల్ స్టార్ సింహాసనానికి ఎసరు పెడతాడనే డౌట్ కి, వార్2 మూవీ గేట్ వేస్తోంది. వార్ 2 సినిమా కేవలం రెండు వారాలా షూటింగ్ తప్ప మొత్తం పూర్తైనట్టే..
ఈ సినిమా లో తన పెర్ఫామెన్స్ నచ్చి యష్ చోప్రా బ్యానర్ లో సోలో హీరోగా ఎన్టీఆర్ కి ఆఫర్ రావటమే కాదు, తన వల్లే ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ 1400 కోట్లు దాటిందట. నెట్ ఫ్లిక్స్ ఈ మూవీకి ఏకంగా 500 కోట్లు కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక 900 కోట్లలో ఓవర్ సీస్, సౌత్ థియేట్రికల్ రైట్స్ ఆఫరే 400 కోట్లని తెలుస్తోంది. అంటే ఇంకా నార్త్ ఇండియా రైట్స్ సేల్ చేయలేదు. యష్ రాజ్ బ్యానరే డైరెక్ట్ గా థియేటర్స్ ని రన్ చేస్తూ అక్కడ రిలీజ్ చేస్తుంది కాబట్టి, ఆ వసూళ్లు అదనంఅంటే వార్2 మూవీ రిలీజ్ కిముందే ఆల్ మోస్ట్ రెండు వేల కోట్ల లెక్కల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. దీనికి తోడు తన డ్రాగన్ మూవీ సెట్స్ పైకెళ్లక ముందే 400 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యేలా ఉన్నాయి. ఇంత భారీ ఎమౌంట్స్ ప్రభాస్ మూవీలకు కూడా రాలేదు. అది కూడా రిలీజ్ కాకముందు ఒక సినిమా, సెట్స్ పైకెళ్లకముందు మరో మూవీ… ఇది నిజంగా ఎలా సాధ్యమైందని ఆలోచిస్తే, వార్2 మూవీతో హిందీలో ఎన్టీఆర్ రేంజ్ అందనంత ఎత్తుకు చేరుకునేలా ఉందనంటున్నారు.
నార్త్ లో ఊరమాస్ జనాల పాపులేషన్ ఎక్కువ. ఎన్టీఆర్ కి పెర్ఫామెన్స్ తోపాటు, డాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా ఉన్న ఊర మాస్ ఫాలోయింగ్ దేవరని నార్త్ లో 350 కోట్ల వసూళ్లకే కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. లేదంటే కొరటాలా ఇచ్చి కథలో అంత అద్భుతాలేం లేవు.. కేవలం ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మాస్ ఇమేజే ఆ సినిమాను 670 కోట్ల మూవీగా మార్చిందంటున్నారు. ఇంకాస్త కంటెట్ తోడైతే 1000 కోట్లు పెద్ద లెక్కకాదనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టే, ప్రబాస్ తో పోలిస్తే సైలెంట్ గా ఎన్టీఆర్ నార్త్ మార్కెట్ లోఎవరూ టచ్ చేయలేని రేంజ్ కి చేరుకుంటున్నాడనే అభిప్రాయముంది. వార్ 2 మూవీ నిజంగానే ప్రిరిలీజ్ బిజినెస్ రేంజ్ లో సినిమాని ఊపేస్తే ఎన్టీఆర్ నిజంగా పాన్ ఇండియా నెంబర్ వన్ కింగ్ అనే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే హిందీలోకెళ్లి అక్కడ మార్కెట్ ని డామినేట్ చేయటం సౌత్ నుంచి, దర్శకులకు సాధ్యమైంది. కాని హీరోలకి సాధ్యం కాలేదు. సో అలా సక్సెస్ అయితే ఎన్టీఆర్ ని పట్టుకోవటం కష్టమే…