దేవర పాటని కామెంట్ చేస్తే వ్యూస్… పుష్ప 2 పాట పేలినా సీన్ రివర్స్..
దేవర మూవీ పాట వచ్చిన కొత్తలో ఊహించనంత ట్రోలింగ్ కి గురైంది. కాని వ్యూస్ మాత్రం పిచ్చెక్కించాయి. ఓరకంగా కామెంట్లు, ట్రోలింగ్స్ దేవరకి కలిసొచ్చాయి కాని, నష్టం చేయలేదన్నారు. కట్ చేస్తే ఇప్పుడు పుష్ప2 వంతొచ్చింది. ఊ అంటావా ఊహూ అంటావా పాటతో పోలిస్తే, కిస్సక్ సాంగ్ పెద్దగా పేలలేదన్నారు.
దేవర మూవీ పాట వచ్చిన కొత్తలో ఊహించనంత ట్రోలింగ్ కి గురైంది. కాని వ్యూస్ మాత్రం పిచ్చెక్కించాయి. ఓరకంగా కామెంట్లు, ట్రోలింగ్స్ దేవరకి కలిసొచ్చాయి కాని, నష్టం చేయలేదన్నారు. కట్ చేస్తే ఇప్పుడు పుష్ప2 వంతొచ్చింది. ఊ అంటావా ఊహూ అంటావా పాటతో పోలిస్తే, కిస్సక్ సాంగ్ పెద్దగా పేలలేదన్నారు. తర్వాత దేవి శ్రీ ప్రసాద్ స్టేజ్ మీద వేసిన సెటైర్లు కూడా ఈ కిస్సక్ సాంగ్ కి రెండు రకాలుగా ట్రోలింగ్ చేసేందుకు ఉపయోగ పడ్డాయంటున్నారు. ఒకవైపు పాట తూటాలా పేలలేదని అనటం, మరో వైపు సోషల్ మీడియాలో ఈ పాటని వ్యతిరేకించిన వాళ్లు, సడన్ గా డీ ఎస్పీనీ టార్గెట్ చేయటం ఇలా రకరకరాల టర్న్ తీసుకుంటోంది ఈ సాంగ్. కాని ఇంత చేసినా చుట్టమల్లే లాంటి మెలోడీని కూడా మాస్ సాంగ్ కిస్సక్ వ్యూస్ టచ్ చేయలేకపోతున్నాయి. ఇది మంచి శకునం కాదంటూ కామెంట్ల హల్చల్ కూడా పెరిగిపోయింది.
చుట్టమల్లే సాంగ్ అలా ఉంది, ఇలా కాపీ అయ్యిందని, అనిరుధ్ ని తిడుతున్నామన్న నెపంతో, ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేశారు. కట్ చేస్తే ఆ పాటే తూటాలా పేలింది. సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఓటీటీని కూడా షేక్ చేస్తోంది. దేశ భాషల్లోనే కాదు విదేశీ భాషల్లో కూడా దేవర ఓటీటీ రికార్డులు షాక్ ఇస్తున్నాయి… ఇలాంటి టైంలో దేవర పాటతో పుష్ప2 సాంగ్ పోలికలు మెలికలు పెడుతున్నాయి
పుష్ప లో ఊ కొడతావా సాంగ్ ని మించేలా పుస్2 లో కిస్సిక్ సాంగ్ పేలుతుందనుకున్నారు. కాని పాట పేలలేదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ మాటలే పేలాయి. అదో వివాదంగా మారటమే కాదు, పుష్ప2 రిజల్ట్ ని ఎక్కడ రివర్స్ చేస్తుందో అన్న టెన్షన్ ప్రొడ్యూసర్స్ లో పెరిగింది.
నిజానికి దేవి టార్గెట్ నిర్మాతలు కాదు, దర్శకుడు సుకుమార్, హీరో బన్నీనే అనంటున్నారు. వాళ్లని డైరెక్ట్ గా అనలేక, నిర్మాతల మీద కామెంట్ల రూపంలో ఇలా సెటైర్లు వేశాడు దేవి అనంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇంతగా వివాదానికి తన స్పీచ్ తో అగ్గి రాజేసిన దేవి శ్రీనే ఇప్పుడు ట్రోలింగ్ కి గురౌతున్నాడు
తన కిస్సిక్ సాంగ్ సోసోగా ఉందని కొందరు, ఇందులో ఇంకేముందని చాలా మంది ట్రోల చేశారు. అసలు ఈ పాట పుష్ప1 లో ఉంచి, పుష్ప2 లో ఊ అంటావా సాంగ్ పెడితే బాగుండని ఇంకొందరు కామెంట్లు పెంచారు. ఇలా ఒక బ్యాచ్ పుష్ప2 సాంగ్స్ ని ట్రోల్ చేస్తుంటే, దేవి శ్రీ మాటలను రకరకాలుగా డీకోడ్ చేసి, ఐకాన్ స్టార్ ని, సుకుమార్ ని ఉతికి ఆరేస్తున్నారు ట్రోలర్స్..
సందు దొరికితే సౌత్ హీరోలని తక్కువ చేసేందుకు ప్రయత్నించే బాలీవుడ్ లో ఒక బ్యాచ్ అయితే, ఇదే అడ్వాంటేజ్ తీసుకుని, పుష్ప2ని ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో వేసుకుంటోంది. పవన్ ఫ్యాన్స్, మహేశ్ ఫ్యాన్స్, ఇలా అంతా పుష్ప2 మీద విరుచుకుపడుతుంటే, ఈ కామెంట్లే ఫ్రీ ప్రమోషన్ గా మారుతాయనుకున్నారు. కాని దేవరకి, సలార్ , కల్కీకి కలిసొచ్చిన కామెంట్ల దాడి పుష్ప2 కి మాత్రం తలనొప్పిగా మారింది. కిస్సక్ సాంగ్ దేవరలోని మెలోడీ సాంగ్ చుట్టమల్లే పాటతో పోల్చుకోలేనంతగా యూ ట్యూబ్ లో వెనుకబడింది.