Tollywood Movies: హాలీవుడ్ సినిమా ఫ్లాపు.. తెలుగు, తమిళ్ మూవీలు తోపు.. క్యా సీన్ హై..
హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ 7వ సీక్వెల్ లో సీన్లు, ఫైట్లు అదిరాయి, కాని కథనమే ఊహించ తగ్గట్టు ఉందనే కామెంట్ వచ్చింది. ఏదేమైనా ఇక్కడ ఓపెనింగ్స్ అదిరాయి. కాని తర్వతే టాక్ వీకౌతోంది. మొత్తానికి ఈ వారం వచ్చే సినిమాలకు మిషన్ ఇంపాజిబుల్ 7 తో పంచ్ పడుతుందనుకుంటే, ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది.

Compared to Hollywood Mission Impossible, Tollywood's Baby and Nayakudu, Mahaveerudu movie became a hit
ముందుగా విజయే దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన బేబీ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. ఏదో పెద్ద హీరో సినిమా వస్తోందనేంతగా జనం ఎదురుచూసేలా చేసింది సినిమాట్రైలర్. ఇక మూవీ టాక్ కూడా కిక్ ఇస్తోంది. టెంథ్ ఫేయిలైన చిన్ననాటి లవర్ కి, ఇంజనీరింగ్ లో తనతో కలిసి చదివే లవర్ కి మధ్య నలిగే ఓ అమ్మాయి కథ, యూత్ ని కదిలిస్తోంది. దర్శకుడి ప్రతిభకి వసూళ్ల వరద దాసోహమంటోంది.
ఇదేనా ఈవారంవిచిత్రంగా రెండు తమిళ మూవీలు కూడా ఇలానే ఆకట్టుకుంటున్నాయి. నాయకుడు అంటూ ఉదయనిధి స్టాలిన్ తో కీర్తి సురేష్ చేసిన ప్రయోగానికి గూస్ బంబ్స్ వస్తున్నాయంటన్నారు. మన బ్రహ్మీ లానే కోలీవుడ్ లో కామెడీ దాడి చేసే వడీవేలు కూడా ఈసారి కదలించే పాత్రలో మతిపోగొట్టాడు. ఇక శివ కార్తికేయన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో చేసిన మహా వీరుడు కూడా దుమ్మదుులుపుతోంది. ఈరెండు తమిళ మూవీలు కూడా లోకల్ సినిమాల్లానే హిట్ టాక్ తో క్రౌడ్ పుల్లర్స్ గా మారాయి.