Mahesh allu arjun : మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య పోటీ ఆగదు..
మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) ఈ ఇద్దరు స్టార్ హీరోలకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.కొన్ని లక్షలాది మంది అభిమాన ఘనం వాళ్ళ సొంతం. ఆ ఇద్దరి సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు బాక్స్ ఆఫీస్ కి పూనకాలు పుట్టాల్సిందే. తమ సినీ కెరీర్ లో ఎన్నో అధ్బుతమైన చిత్రాల్లో నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు.

Competition between Mahesh Babu and Allu Arjun will not stop..
మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) ఈ ఇద్దరు స్టార్ హీరోలకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.కొన్ని లక్షలాది మంది అభిమాన ఘనం వాళ్ళ సొంతం. ఆ ఇద్దరి సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు బాక్స్ ఆఫీస్ కి పూనకాలు పుట్టాల్సిందే. తమ సినీ కెరీర్ లో ఎన్నో అధ్బుతమైన చిత్రాల్లో నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు.
మహేష్ బాబు చాలా సంవత్సరాల కిందటే సినీ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఏషియన్ సంస్థతో కలిసి ఏషియన్ మహేష్ బాబు పేరుతో మల్టిప్లెక్స్ ని ప్రారంభించాడు. హైదరాబాద్ నగరంలో నిర్మాణం జరుపుకున్న ఆ మల్టిప్లెక్స్ (Multiflexi) కి మంచి పేరు కూడా ఉంది. రీసెంట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూడా మరో మల్టిప్లెక్స్ ని నిర్మించబోతున్నాడు. మహేష్ బాబు లాగానే అల్లు అర్జున్ కూడా ఏషియన్ సంస్థ తో కలిసి ఏషియన్ అల్లు అర్జున్ అనే మల్టిప్లెక్స్ ని నిర్మించాడు. ఇప్పుడు వైజాగ్ లో కూడా మరో మల్టిప్లెక్స్ ని నిర్మించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. దీంతో మహేష్, అల్లు అర్జున్ లు మల్టిప్లెక్స్ లు నిర్మించే విషయంలో పోటీ పడుతున్నారని ఇరువురి ఫ్యాన్స్ సరదాగా అనుకుంటున్నారు.
ఏది ఏమైనా మహేష్ బన్నీ లు సినిమాల ద్వారా సంపాదిస్తున్న డబ్బులని తిరిగి సినిమాలకే పెట్టడం నిజంగా గ్రేట్. పైగా వీళ్లిద్దరికీ సినిమా అంటే ఎంత ప్రాణమో కూడా తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో నటించే మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అగస్ట్ 15 న ఆ మూవీ విడుదల కానుంది.