Ranbir Kapoor: వివాదంలో రణ్‌బీర్ కపూర్.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు
రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్‌తో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్నాడు. ఈ వేడుకల్లో భాగంగా రణ్‌బీర్ కేక్ కట్ చేశాడు. ఈ సందర్భంగా కేకుపై మద్యం పోసి, నిప్పంటించాడు.

Ranbir Kapoor: యానిమల్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని ఆయనపై కేసు నమోదైంది. ఇటీవల రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్‌తో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్నాడు. ఈ వేడుకల్లో భాగంగా రణ్‌బీర్ కేక్ కట్ చేశాడు. ఈ సందర్భంగా కేకుపై మద్యం పోసి, నిప్పంటించాడు.
Ram Charan: తనే నా బలం.. చరణ్ ప్రేమ కోసం అలాంటి త్యాగం..!
ఈ సమయంలో ఆయన జై మాతాది అంటూ అరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వివాదం మొదలైంది. క్రైస్తవ మతానికి సంబంధించిన వేడుకలో మద్యం వినియోగిస్తూ, హిందువులు పవిత్రంగా భావించే జై మాతాది అనడంపై పలువురు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రణ్‌బీర్ చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ తివారీ అనే ఒక హిందుత్వ వాది న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాతో కలిసి రణ్‌బీర్ కపూర్‌పై ముంబయిలోని ఘాట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రణబీర్ కపూర్ మతపరమైన మనోభావాలను కించపరిచారని తివారీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రణబీర్ కపూర్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ నినాదాలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై ఇప్పటివరకూ పోలీసులు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మరి దీనిపై రణబీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరోవైపు రణ్‌బీర్ నటించిన యానిమల్ రూ.900 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సంతోషంలో తమ కూతురు రాహాను రణ్‌బీర్ అభిమానులకు పరిచయం చేశాడు. ఇటీవలే తన ముఖాన్ని చూపించాడు. దీంతో రాహా.. రణబీర్-అలియా ఇద్దరి పోలికలతో చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.