Og : “ఓజి” రిలీజ్ పై ఫ్యాన్స్‌లో కన్‌ఫ్యూజన్
ఏపీలో ఎన్నికలు (AP Elections) అయిపోవడంతో ఇక సినీ అభిమానులు సిమిమా వార్తల కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు.. అందరికంటే ఎక్కువగా పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyana) ఫ్యాన్స్ తమ హీరో మూవీ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Confusion among fans on "OG" release
ఏపీలో ఎన్నికలు (AP Elections) అయిపోవడంతో ఇక సినీ అభిమానులు సిమిమా వార్తల కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు.. అందరికంటే ఎక్కువగా పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyana) ఫ్యాన్స్ తమ హీరో మూవీ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ గా సహా సినిమా పరంగా ఓ రేంజ్ కిక్ ఇస్తాడని కళ్లు కాయలు కాసేలా ఎదురు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ (Power Star) ఫ్యాన్స్ ఓజీ మూవీ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. యంగ్ దర్శకుడు సుజిత్ (Sujith) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పవన్ ఓ పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో అలరిస్తున్నాడని హైఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ జూన్ 4న ఉండబోతుందన్న వార్త ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఫుల్ జోష్‌లో ముంచేసింది.. అయితే.. ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో కొన్ని అనుమానాలు ఫ్యాన్స్‌ను వెంటాడుతుండగా.. అవి ఇప్పుడు మరింత బలపడ్డాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27 కోసం ఆల్రెడీ ఎన్టీఆర్ లు చూస్తున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే డేట్‌కోసం మరో యంగ్ హీరో కోసం చూస్తున్నట్లు ఓ లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ డేట్ ని ఆల్రెడీ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) లక్కీ భాస్కర్ తో లాక్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నిజానికి నాగవంశీ, త్రివిక్రమ్‌లు పవన్‌కి అత్యంత సన్నిహితులు.. సో వారికి తెలియకుండా పవన్ డేట్‌ని లాక్ చేయరు. బహుశా ఓజీ సినిమా సెప్టెంబర్ 27న రాదు అని తెలిస్తేనే ఈ సినిమాని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే.. ఓజీ సినిమా రిలీజ్ వాయిదా పడింది అనుకోవాలా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో.. పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. తెరమీద పవన్ హంగామా చూడాలనుకుంటుంటే… ఆలస్యమయ్యేటట్టుందే అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి.. ఈ అనుమానాలకు తెరపడాలంటే.. మూవీ టీం స్పందించాలి.. మరి డివివి దానయ్య నుంచి ఎలాంటి క్లారిటీ అయినా వస్తుందేమో వేచి చూడాల్సిందే.