టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పై.. బాలీవుడ్ కుట్ర చేస్తుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రభాస్ విషయంలో బాలీవుడ్ ముందు నుంచి కుళ్ళుగానే ఉంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరగడం... వరల్డ్ వైడ్ గా ప్రభాస్ సినిమాలకు భారీ క్రేజ్ రావడం.. నార్త్ ఇండియాలో తమ సినిమాలను ప్రభాస్ సినిమాలు దెబ్బ కొట్టడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బాలీవుడ్ ఉంది. తెలుగులో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే బాలీవుడ్ హీరోలకు చెమటలు పడుతున్నాయి. ఒక్కో సినిమాతో రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్. దీనితో బాలీవుడ్ హీరోలకు థియేటర్లు దొరకడం కూడా కష్టంగానే మారుతుంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా కర్ణాటక.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహ అనేక రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్.. పంజాబ్ హర్యానా రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టాడు దీనితో ఇప్పుడు ప్రభాస్ విషయంలో కాస్త పక్కా లెక్కలతో వెళ్లాలని... అతని సినిమాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని బాలీవుడ్ ప్లాన్ చేస్తుంది. తమ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావాలి అంటే కచ్చితంగా ప్రభాస్ సినిమాలకు థియేటర్లు దొరకకుండా చూడాలి అని నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్లకు కఠినంగానే చెప్పేందుకు కొంతమంది నిర్మాతలు రెడీ అయ్యారు. బాలీవుడ్లో అగ్ర నిర్మాత ఒకరు.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఉన్న థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే తన మెసేజ్ లు పంపించారు. ప్రభాస్ సినిమా రిలీజ్ టైం లో బాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయని.. వాటికి థియేటర్లను భారీగా కేటాయించాలని కోరినట్లు సమాచారం. బడా నిర్మాత కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ విషయంలో దాదాపుగా ఓకే చెప్పేశారు. ఈ ఏడాది వేసవి నుంచి ప్రభాస్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపుగా ఈ ఏడాది చివర్లో కూడా మరో సినిమా కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల చేయాలని ప్రభాస్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పటికే తెలుగు సినిమాలతో నానా ఇబ్బందులు పడుతున్న బాలీవుడ్.. ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తే కచ్చితంగా ధియేటర్ల విషయంలో.. కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. తాజాగా పుష్ప సినిమా కొట్టిన దెబ్బకు బాలీవుడ్ విలవిలలాడిపోతోంది. అందుకే నార్త్ ఇండియాలో థియేటర్ లు దక్కకుండా చూడాలని అక్కడి బడ నిర్మాతలు వర్కౌట్ మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ లో తెలుగు సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. అటు పంజాబ్ లో కూడా మన సినిమాలను ఎక్కువగా ఆడించే ప్రయత్నం చేయడంతో నిర్మాతలు అలర్ట్ అవుతున్నారు.[embed]https://www.youtube.com/watch?v=P1ZPZ8bmNSw[/embed]