ముంబైలో పుష్పపై కుట్ర, థియేటర్లో స్ప్రే చేసింది ఎవరు…?
పుష్ప ది రూల్ సక్సెస్ కావడం ఏమో గాని వరుస వివాదాలు తలనొప్పిగా మారాయి. సినిమాను ట్రోల్ చేయడం ఒక సమస్య అయితే సినిమా రిలీజ్ దగ్గరి నుంచి ప్రతీ ఒక్కటీ చికాకుగానే మారింది. సినిమాలో లేని డైలాగ్స్ ను ఉన్నాయి అంటూ మెగా ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టింది ఓ వర్గం.
పుష్ప ది రూల్ సక్సెస్ కావడం ఏమో గాని వరుస వివాదాలు తలనొప్పిగా మారాయి. సినిమాను ట్రోల్ చేయడం ఒక సమస్య అయితే సినిమా రిలీజ్ దగ్గరి నుంచి ప్రతీ ఒక్కటీ చికాకుగానే మారింది. సినిమాలో లేని డైలాగ్స్ ను ఉన్నాయి అంటూ మెగా ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టింది ఓ వర్గం. తీరా సినిమా చూసిన వాళ్ళు అసలు ఆ డైలాగ్స్ ఎక్కడ ఉన్నాయని క్వశ్చన్ చేసారు. ఇక సినిమా పుణ్యమా అని అల్లు అర్జున్ పై ఓ కేసు కూడా నమోదు అయింది. హైదరాబాద్ లో సంధ్య 70 ఎంఎం థియేటర్ కు బన్నీ ప్రీమియర్ షోకు వెళ్ళాడు.
అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. అభిమానులు వస్తారని తెలిసినా బన్నీ వెళ్లి సినిమా చూడాలి అనుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనితో అతనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని అల్లు అర్జున్ అలాగే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన కూడా చేసాయి. పలు సెక్షన్ల కింద పుష్ప టీంపై కేసులు నమోదు చేసారు పోలీసులు.
ఇక ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది పుష్ప 2 ను ప్రదర్శిస్తున్న థియేటర్ లో. నిన్న రాత్రి ముంబైలోని గైటీ గెలాక్సీ థియేటర్‌లో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్లే అవుతున్న టైంలో… సినిమాకు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద పదార్థాన్ని స్ప్రే చేయడంతో అంతరాయం కలిగింది. ఈ సంఘటన తర్వాత చాలా మంది సినిమా ప్రేక్షకులు దగ్గడం, తుమ్మడం కనపడింది. అలాగే తమకు గొంతులో మంటగా ఉందని, ఇబ్బందిగా ఉందని, అలాగే స్కిన్ కూడా దురద వచ్చింది అంటూ కంప్లైంట్ చేసారు. దీనితో సినిమా ప్రదర్శన ఆపేశారు.
బాంద్రాలోని ఈ సినిమా హాలులో కాసేపు గందరగోళం నెలకొనడంతో భయాందోళనలకు గురైన సినీ ప్రేక్షకులు తమ ముఖాలకు మాస్క్ లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “సినిమా ఆగిపోయింది. ఎవరో ఏదో స్ప్రే చేసారు, అందరూ దగ్గుతున్నారు” అని ఒక వ్యక్తి వీడియోలో చెప్పడం వినపడింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే థియేటర్ వద్దకు చేరుకున్నారు. అయితే కేసు నమోదు చేయలేదని సమాచారం. ఇక సినిమాకు నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. కావాలనే సినిమాను ఇబ్బంది పెట్టేందుకే కొందరు కుట్రలు చేసారు అనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం సీసీ ఫూటేజ్ ను పరిశీలిస్తోంది. అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.