సినిమా అంటే కేవలం 3 గంటల వినోదం కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి, సంవత్సరం పాటు సమయం, వందల మంది కష్టం. ఇవన్నీ కలిస్తేనే ఒక సినిమా బయటికి వస్తుంది. అంత కష్టపడి సినిమా తీస్తే.. ఒకే రోజులో దాన్ని పైరసీ చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ సినిమా మీద ఎన్న ఆశలు పెట్టుకున్నారో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. 480 కోట్లతో తీసిని ఈ సినిమాను చాలా సింపుల్‌గా పైరసీ చేశారు కొందరు నీచులు. సినిమా రిలీజైన మరుసటి రోజే హెడీ ప్రింట్ ఇంటర్నెట్‌లో పెట్టేశారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మూవీ యూనిట్‌కు బెదిరింపులు వచ్చాయట. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీ చేస్తామని కొందరు బెదిరించారంటూ చెప్తున్నారు మూవీ టీం. సినిమా రిలీజ్‌కు ముందు రోజు వాళ్లే సినిమాలోని కీలక ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. సినిమా రిలీజ్ అయ్యాక 24 గంటలు కూడా అవ్వకుండానే హెడీ ప్రింట్‌ను ఇంటర్నెట్‌లో పెట్టేశారు. మూవీ యూనిట్‌కు వచ్చిన ఫోన్లు, మెసేజ్‌ల ఆధారంగా 45 మంది మీద కేసులు నమోదు చేశారు సైబర్ క్రైం పోలీసులు. ఈ సినిమా డౌన్‌లోడ్ లింక్‌ను మరింత వైరల్ చేసేందుకు కొన్ని సోషల్ మీడియా పేజ్‌లు కూడా పని చేశాయి. మీమ్ పేజెస్‌లో, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్‌లో గేమ్ ఛేంజర్ సినిమా లింక్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఆ అకౌంట్‌లను కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. లింక్ వైరల్ చేసిన వాళ్ల మీద కూడా కేసులు బుక్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ లీక్ ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఈ వ్యవహారం వెనక ఉన్నది ఎవరు, రామ్ చరణ్‌కు నష్టం కలిగించాలని ప్రయత్నించింది ఎవరూ అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. దర్యాప్తు పూర్తైన తరువాత కేసు గురించి సంచలన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.[embed]https://www.youtube.com/watch?v=OxPO-I_VYFI[/embed]