కోర్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని పంట పండింది.. 6 కోట్ల సినిమాకు అన్ని కోట్ల ఓపెనింగ్..!
కొన్నిసార్లు కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ రావడానికి కేవలం ఆ సినిమాల నిర్మాతలు చాలు. వాళ్ళు చెప్పే మాటలు చాలు ప్రేక్షకులు గుడ్డిగా నమ్మి థియేటర్ వైపు వెళ్తారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది.

కొన్నిసార్లు కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ రావడానికి కేవలం ఆ సినిమాల నిర్మాతలు చాలు. వాళ్ళు చెప్పే మాటలు చాలు ప్రేక్షకులు గుడ్డిగా నమ్మి థియేటర్ వైపు వెళ్తారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమాలో నటించిన వాళ్లు స్టార్స్ కాదు.. తీసింది కొత్త దర్శకుడు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే వరకూ ఇలాంటి ఒక సినిమా వస్తుందని విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి ఒకే ఒక్కడు కారణం.. అతడే నాచురల్ స్టార్ నాని. ప్రొడ్యూసర్ ఆఫ్ కోర్ట్. వాల్ పోస్టర్ సినిమా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ కచ్చితంగా అది బాగుంటుంది అదే నమ్మకంతో థియేటర్ వైపు వెళ్తున్నారు. దాన్ని 100% సక్సెస్ రేట్ తో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు నాని. ఇప్పుడు కోర్టు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ లాంటి వాళ్ళు నటించిన కోర్టు ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు మిగిలిన అన్ని ఇండస్ట్రీలు కూడా షాక్ అవుతున్నాయి.
ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు మిగిలిన ఇండస్ట్రీల నిర్మాతలు. తెలుగులో ఏదో కోర్ట్ అనే సినిమా వచ్చిందంట.. బాగుందంట అంటూ ఇప్పటికే తమిళ, మలయాళ మీడియాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాను అలా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు రామ్ జగదీష్. ఒక మీడియం రేంజ్ హీరో స్థాయిలో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్స్ వేస్తే అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. స్టార్ హీరోల సినిమాలకు వేసినట్టు విజిల్స్ వేస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా విషయంలో నాని నమ్మిన కంటెంట్ ప్రేక్షకులకు కూడా బాగా రీచ్ అయింది అని ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రమోషన్స్ తో కలిపి కోర్టు కోసం నాని పెట్టిన ఖర్చు 8 కోట్లు. ఇప్పుడు ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ 8.10 కోట్ల గ్రాస్. దాదాపు నాలుగు కోట్ల షేర్ వచ్చింది.
ఈ వీకెండ్ ఇంక ఏ సినిమాలో లేవు. కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్ కోర్ట్ కు క్యూ కడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి రోజు 8 కోట్ల గ్రాస్ తీసుకురావడంతో.. కచ్చితంగా ఈ వీకెండ్ అయిపోయేసరికి సినిమాకు ఎంత లేదన్న 15 కోట్లకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నాడు నాని. దాంతో లాభాల పంట ఖాయం. అన్నట్టు ఈ సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ అయిపోయింది. ఈటీవీ విన్ ఏకంగా 8 కోట్లకు ఏ సినిమాను కొనేసింది. దానికి తోడు డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ రూపంలో నానికి మరో 5 కోట్లకు పైగానే వచ్చాయి. ఎలా చూసుకున్నా కూడా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాడు నాచురల్ స్టార్. ఇప్పుడు విడుదల తర్వాత థియేటర్స్ నుంచి రియల్ ప్రాఫిట్స్ అందుకోబోతున్నాడు. ఎంతైనా ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా నిర్మించడమే పెద్ద విషయం అనుకుంటే.. దాంతో భారీ లాభాలు అందుకోవడం అనేది ఇంకా పెద్ద విషయం. నాని ప్రతిసారి అది చేసి చూపిస్తున్నాడు. ఆయన స్టోరీ జడ్జిమెంట్ కు ఇది నిదర్శనం.