YASH-PRABHAS: యష్, ప్రభాస్.. 2024లో ఊహించని కాంబినేషన్లతో సెన్సేషన్?

దంగల్ డైరెక్టర్ నితీష్ తీవారి తీసే రామయణంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఓకే అయితే, సీతగా సాయిపల్లవి కినిపించబోతోందని ఎప్పుడో తేలింది. రావణుడిగా యశ్ కనిపంచబోతుంటే, హనుమంతుడిగా బాబీ డియోల్, శూర్పణఖగా రకుల్ కన్ఫామ్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 05:44 PMLast Updated on: Feb 15, 2024 | 5:44 PM

Crazy Combinations In Line In Tollywood And Bollywood

YASH-PRABHAS: కన్నడ స్టార్ యష్ కొత్త మూవీ టాక్సిక్‌లో షారుక్ గెస్ట్ కాదు రణ్‌వీర్ సింగ్ గెస్ట్ అని తేలింది. షారుక్ వార్తలు కేవలం రూమర్స్ అని యష్ తేల్చేశాడు. అయినా యష్ మూవీలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ స్పెషల్ గెస్ట్ అంటే నిజంగా ఈ కాంబినేషన్ విచిత్రమే. అంతే కాదు ఈ ఏడాది ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన కాంబినేషన్లలో సినిమాలు రాబోతున్నాయి. దంగల్ డైరెక్టర్ నితీష్ తీవారి తీసే రామయణంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఓకే అయితే, సీతగా సాయిపల్లవి కినిపించబోతోందని ఎప్పుడో తేలింది.

KALKI 2898 AD: ప్రభాస్‌తో కలిసి సెట్‌లో కమల్, అమితాబ్ సందడి

రావణుడిగా యశ్ కనిపంచబోతుంటే, హనుమంతుడిగా బాబీ డియోల్, శూర్పణఖగా రకుల్ కన్ఫామ్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఇంతకుముందెన్నడూ ఇలాంటి కాంబినేషన్లు చూడలేదు. అదే ఈ ఏడాది సాధ్యం కాబోతోంది. ఇక శేఖర్ కమ్ముల మేకింగ్‌లో ధనుష్ చేసే ట్రైలింగువల్ మూవీలో నాగార్జున స్పెషల్ రోల్ వేస్తున్నాడు. అదే కల్కిలో అయితే ఇలాంటి చిత్ర విచిత్ర కాంబినేషన్లకు కొదువ లేదు. ఫస్ట్ టైం ప్రభాస్‌తో లోకనాయకుడు కమల్, బిగ్ బి అమితాబ్, దీపికా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. దుల్కర్ సల్మాన్ కల్కితోపాటు బాలయ్యతో బాబీ తీసే మూవీలో కూడా గెస్ట్ రోల్ వేస్తున్నాడు.

ఇక బాలీవుడ్ వార్ 2 మూవీ విషయానికొస్తే అక్కడి గ్రీక్ గాడ్ హృతిక్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అలా తారక్, హృతిక్ కాంబినేషన్‌లో హిందీ సినిమా రాబోతోంది. ఇలాంటి ఎన్నో వెరైటీ కాంబినేషన్లకు 2024 వేదిక కాబోతోంది.