Venkatesh: సురెందర్ రెడ్డి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్..?

విక్టరీ వెంకటేశ్, సురెందర్ రెడ్డి కాంబోలో ఒక సినిమా రూపొందనుంది. ఇది వెంకటేశ్ 76వ సినిమా అవుతుంది. ఇది యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ సురెందర్ రెడ్డి.. వెంకటేశ్‌కు కథ చెప్పేశారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2023 | 08:56 PMLast Updated on: Oct 09, 2023 | 8:56 PM

Crazy Combo On Cards Surendar Reddy To Direct Venkatesh

Venkatesh: ఏజెంట్ మూవీతో డీలాపడ్డ దర్శకుడు సురెందర్ రెడ్డి.. దాన్నుంచి కోలుకుని వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో ఒక చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే, ఆ తర్వాత చేయబోయే సినిమాను కూడా సురెందర్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అది విక్టరీ వెంకటేశ్‌తో కావడం విశేషం. విక్టరీ వెంకటేశ్, సురెందర్ రెడ్డి కాంబోలో ఒక సినిమా రూపొందనుంది. ఇది వెంకటేశ్ 76వ సినిమా అవుతుంది.

ఇది యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ సురెందర్ రెడ్డి.. వెంకటేశ్‌కు కథ చెప్పేశారట. దీనికి వెంకీ కూడా అంగీకరించారట. ఆయనకు కథ బాగా నచ్చి, వెంటనే సినిమాకు అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం వెంకీ.. తన 75వ సినిమాగా సైంధవ్ చేస్తున్నారు. హిట్ సిరీస్ దర్శకుడు శైలేశ్ కొలను సైంధవ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ ప్రధానంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత సురెందర్ రెడ్డి సినిమా మొదలవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే చాన్స్ ఉంది. ఆ లోపు సురెందర్ రెడ్డి.. పవన్ సినిమా కంప్లీట్ చేయొచ్చు.

సురేందర్ రెడ్డి మేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంటుందనే పేరుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఆయన మార్కు కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఆయన గత చిత్రం ఏజెంట్ ఫ్లాప్ అవ్వడం ద్వారా పలు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో సురెందర్ రెడ్డి ఉన్నారు.