అక్కడ రోజుకు కోటి… షోకి 25 లక్షలు… హ్యాష్ ట్యాగ్ వైరల్…
దేవర రిలీజై 18 రోజులౌతోంది... ఈలోపు ఆల్ మోస్ట్ అరడజన్ కంటే ఎక్కువే ఇంట్రస్టింగ్ ప్రయోగాలొచ్చాయి.. కొన్ని దేవరని మింగేస్తాయన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ దూకుడికి బ్రేక్ వేస్తాయన్నారు. కాని వాటీ అడ్రస్ గల్లంతవ్వటమే కాదు, విడుదలై 18 రోజులు గడుస్తున్నా దేవర జోరు తగ్గలేదు.
దేవర రిలీజై 18 రోజులౌతోంది… ఈలోపు ఆల్ మోస్ట్ అరడజన్ కంటే ఎక్కువే ఇంట్రస్టింగ్ ప్రయోగాలొచ్చాయి.. కొన్ని దేవరని మింగేస్తాయన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ దూకుడికి బ్రేక్ వేస్తాయన్నారు. కాని వాటీ అడ్రస్ గల్లంతవ్వటమే కాదు, విడుదలై 18 రోజులు గడుస్తున్నా దేవర జోరు తగ్గలేదు. స్టిల్, ఇప్పటికీ రోజుకి కోటి రాబడుతున్నాడు దేవర. ప్రతీ షోకి కనీసం పాతికలక్షల జోరు కనిపిస్తోంది. 18 రోజుల్లో 510 కోట్ల షేర్ రాబట్టి పాన్ ఇండియా సినిమాల హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేసింది. గ్రాస్ కలెక్షన్స్ కాదని, నిర్మాత ఎకౌంట్ లో పడే షేర్ డిటేల్స్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది దేవర మూవీ. ఐతే ఇన్ని వందలకోట్ల వసూల్లు వచ్చినా కాని, ప్రస్థుతం దేవర ఒక దగ్గర రోజుకి కోటి రాబట్టడమే హాట్ టాపిక్ అయ్యింది ఎందుకు? ప్రజెంట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ వైరలెందుకు అవుతోంది? సోషల్ మీడియాలో దేవర రికార్డుల జాతర మీద మళ్లీ కొత్తగా చర్చ ఎందుకు షురూ అయ్యింది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర విడుదలైన 18 రోజులైనా, ఆ జోరు తగ్గలేదు. ఈలోపు ఎన్ని కామెంట్లు, ఎంత నెగెటీవ్ రివ్యూలు.. ఇలా ఎన్నో యాసిడ్ టెస్ట్ లని పాసైంది దేవరమూవీ. రాజమౌలి మేకింగ్ లో హిట్ కొట్టిన వెంటనే ఏ హీరోకైనా ఫ్లాప్ పడాల్సిందే అన్న సెంటిమెంట్ ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు
అయితే ఏపి, తెలంగాణలో దేవర రోజుకి కోటి రాబట్టడం షాకింగ్ గా ఉంది. 172 కోట్ల ఓపెనింగ్స్, భారీగా ప్రివ్యూతో జరిగిన జన జాతర, అన్నీంటికి మించి సూపర్ స్టార్ వెట్టయాన్ మూవీ పోటీ కొస్తే, దాన్ని పాతాళానికి తొక్కేయటం, స్వాగ్, విశ్వం, హిందీ మూవీ జిగ్రాతో సహా అరడజన్ మూవీలను వెనక్కి నెట్టడం..
ఇలా ఈ 18 రోజుల్లో దేవర ఎన్నో ఎత్తు పల్లాలను చూసినా, వసూళ్ల వరద మాత్రం ఆగలేదు. బాక్సాఫీస్ లో దేవర దూకుడు తగ్గలేదు. ఓదశలో వరుసగా రెండు సోమవారాలు వసూళ్ల వరదలో తగ్గుదల కనిపించినా, ఓవారల్ గా థౌజెండ్ వాలాగా పేల్చి పండగ తెచ్చాడు దేవర.
ఐతే, దేవర ఈ 18రోజుల్లో గ్రాస్ వసూళ్ల పరంగా 390 కోట్లు రాబడితే, షేర్ వసూళ్లు మాత్రం 137 కోట్లని తెలుస్తోంది. బేసిగ్గా గ్రాస్ కలెక్షన్సే అంతా ఎనౌన్స్ చేస్తారు. కాని ఇప్పుడా ట్రెండ్ ని మార్చి నిర్మాతకి దక్కే షేర్ కలెక్షన్స్ ట్రెండ్ ని షురూచేసింది దేవర టీం
అలా కూడా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. నవంబర్ 14 కి కంగువా రాబోతోంది. ఈ దీపావళికి పెద్దగా జనాలు థియేటర్స్ కి క్యూ కట్టే రేంజ్ మూవీలేం లేవు. అంటే దేవర వసూళ్ల వరద ఈ మంథ్ ఎండే కాదు, వచ్చే నెల 14 న వంచే కంగువ వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంతమాత్రాన కంగువ వచ్చి దేవరకి బ్రేక్ వేస్తాడా అంటే, మ్యాన్ ఆఫ్ మాస్ కి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్, నార్త్ ఇండియాలో తన మార్కెట్ పరంగా చూస్తే దేవర వచ్చేనెలాఖరి వరకు ఇలానే సందడి చేసేలా ఉన్నాడు…
కల్కీ వేగంగా 1200 కోట్లు రాబట్టింది. కాని25 రోజుల తర్వాత వసూళ్ల వరద చాలా వరకు తగ్గింది. దేవర ఓపెనింగ్స్ అదిరాయి, తర్వాత కూడా అదే వేగం కనిపించింది. విచిత్రం ఏంటంటే విడుదలై 18 రోజులు గడుస్తున్నా, పండగలు వచ్చి పోయినా, దేవర వసూళ్లలో స్థిరత్వం షాకిస్తోంది… అదెలా సాధ్యమైందో ఇండస్ట్రీ జనాలకు కూడా అర్ధం కావట్లేదు. కలెక్షన్ల జోరు తగ్గలేదు.