RC 16 : ఊరు కోసం రెండు నెలలా
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా చేస్తున్నాడు.

Currently, Mega Power Star Ram Charan is doing a movie 'Game Changer' with star director Shankar.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. పక్కా శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాగా గేమ్ చేంజర్ తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game Changer) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్. ఎందుకంటే.. మరోవైపు చరణ్ అన్నీ రెడీ చేసుకొని ఎదురు చూస్తున్నాడు బుచ్చిబాబు. చరణ్ ఆర్సీ 16 (RC 16) బచ్చిబాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపక్పటికే ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. కానీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. గేమ్ చేంజర్ అయిపోవడమే లేట్.. ఆర్సీ 16 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు చరణ్. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో గ్రామీణ కథా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.
దీంతో.. హైదరాబాద్ ఒక విలేజ్ సెట్‌ను వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రంగస్థలం సినిమాలో తరహాలో ఈసెట్ నిర్మిస్తున్నారట. రంగస్థలం విలేజ్ సెట్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆర్సీ 16 ఊరు కూడా మామూలుగా ఉండదని అంటున్నారు. 75 శాతం సినిమా షూటింగ్ ఈ సెట్‌లోనే జరుగుతుందని సమాచారం. అందుకే.. ఈ సెట్ పూర్తికావడానికి కనీసం రెండు నెలలైనా సమయం పడుతుందని టాక్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.