Prabhas : స్పిరిట్ కోసం బాహుబలి కాంబో

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 తర్వాత కల్కిగా రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతితో కలిసి రాజ సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ పైన ప్రశాంత్‌ నీల్ మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ సలార్ 2.. శౌర్యాంగ పర్వం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి స్పిరిట్‌ మూవీ థియేటర్లోకి రానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2024 | 11:30 AMLast Updated on: Mar 24, 2024 | 11:30 AM

Currently Prabhas Has Huge Pan India Projects In His Hands

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సలార్ 2 తర్వాత కల్కిగా రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మారుతితో కలిసి రాజ సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ పైన ప్రశాంత్‌ నీల్ మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ సలార్ 2.. శౌర్యాంగ పర్వం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి స్పిరిట్‌ మూవీ థియేటర్లోకి రానుంది.

కల్కి, రాజా సాబ్ (Raja Saab) ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. సలార్ 2 (Salaar 2) , స్పిరిట్ (Spirit) మాత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. ఫ్యాన్స్‌కి మాటిచ్చినట్టుగా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. కల్కి షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవగా.. రాజ సాబ్ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది.దీంతో.. ఏప్రిల్‌లో సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అయితే.. స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు? అనేదే అంతుబట్టకుండా ఉంది. ఈ సినిమాలో అనిమల్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఫైనల్ అయిందనే టాక్ ఉన్నప్పటికీ.. నిజమెంత అనేది తెలియదు. కానీ ఇప్పుడు బాహుబలి కాంబోని రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడట సందీప్ రెడ్డి. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి స్వీటీ దగ్గరకు వెళ్లి కథను కూడా వినిపించాడట. అనుష్క కూడా ఓకె చెప్పిందట. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క (Anushka).. ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెడుతోంది. ఈ క్రమంలో స్పిరిట్‌లో స్వీటి పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి.