గతంలో కంటే ఈ సంక్రాంతి సినిమాల పరంగా చాలా స్పైసి స్పైసిగా కనబడింది. సినిమాలు భారీగా పోటీలో ఉండటంతో ఎవరు గెలుస్తారు అనేదానిపై అభిమానులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూశారు. సినిమాల అప్డేట్స్ ఒక్కొక్కటి అభిమానుల్లో క్రేజ్ పెంచేసాయి. రాంచరణ్ ఇద్దరు సీనియర్ హీరోలతో పోటీ పడటంతో గెలుస్తాడా లేదా అనేదానిపై మెగా అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే గేమ్ చేంజర్ ఊహించని షాక్ ఇచ్చింది. క్రమంగా వసూళ్లు డల్ అయిపోవడంతో మెగా అభిమానులు ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా వెనక్కు తగ్గిపోయారు. సినిమా కలెక్షన్స్ పై మొదటి రోజు అబద్ధం ఆడారు అనే ఒపీనియన్ కూడా జనాల్లో వినపడింది. ఏకంగా 186 కోట్లు ఆ సినిమా వసూలు చేసిందని చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. ఇక ఆ తర్వాత నుంచి సినిమా వసూళ్లపై పెద్దగా ఎనౌన్స్మెంట్ రాలేదు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కూడా సినిమా అంత బాగాలేదని తాను అనుకున్నది చేయలేకపోయాను అంటూ చేసిన కామెంట్స్ కూడా సినిమాకు మైనస్ అయ్యాయి. యాక్షన్ పరంగా రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్తున్నా... కథలో పట్టు లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఇదే టైంలో రామ్ చరణ్ కు వేరే సినిమాల నుంచి కూడా పోటీ గట్టిగానే ఉంది.. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రాంచరణ్ తో పోటీపడ్డాయి. గేమ్ చేంజర్ సినిమాతో పోలిస్తే ఈ రెండు సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా యాక్షన్ పరంగా మంచి పండుగ జోష్ ఇచ్చాయి. దీనితో నందమూరి అభిమానులు.. వెంకటేష్ అభిమానులు పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకున్నారు. ఇక బుక్ మై షో లో కూడా సంక్రాంతి చివరి రోజు కలెక్షన్స్ వేరే లెవల్లో వెళ్లాయి. బుక్ మై షో లో బాలకృష్ణ డాకూ మహారాజ్ సినిమా గేమ్ చేంజర్ కు చుక్కలు చూపించింది. ఏకంగా 24 గంటల్లో 1,20,000 టికెట్లు బుక్ అయ్యాయి. అయితే గేమ్ చేంజర్ కు కేవలం 73 వేల టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. వేరే బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో కూడా డాకు మహారాజ్ డామినేషన్ కంటిన్యూ చేసింది. డైరెక్ట్ బుకింగ్స్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కొన్నిచోట్ల నందమూరి అభిమానులు అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా సినిమాకు థియేటర్లో లేవని గొడవ చేశారు. అలాగే థియేటర్ల కేటాయించిన చోట కూడా ఒకటి రెండు షోస్ మాత్రమే రన్ అవుతున్నాయి అని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇప్పుడున్న ఊపు చూస్తే ఈ సినిమా కచ్చితంగా 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉండవచ్చు అనే టాక్ వినబడుతుంది. ఈ వారం మొత్తం సెలవులు ఉండటంతో కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకు భారీగా వెళ్లే ఛాన్స్ ఉంది.[embed]https://www.youtube.com/watch?v=Hu0ZPeaCiTg[/embed]