డబిడి దిబిడే స్టెప్స్’.. తప్పంతా శేఖర్ మాస్టర్ దే.. ఊర్వశి క్లారిటీ

బాబి కొల్లి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకూ మహారాజ్ సినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 11:20 AMLast Updated on: Feb 13, 2025 | 11:20 AM

Daku Maharaj Heroine Sensational Comments

బాబి కొల్లి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకూ మహారాజ్ సినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విజయంతో బాలయ్య మంచి ఊపు మీద ఉన్నారు. అందుకే అఖండ సినిమా సీక్వెల్ కూడా వేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డాకు మహారాజ్ లో బాలయ్య యాక్షన్ కు అభిమానులతో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఆ వయసులో బాలయ్య అంత ఎనర్జీగా యాక్ట్ చేయడం… అలాగే డ్యాన్సుల్లో కూడా బాలయ్య దుమ్ము రేపడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. వేరే సినిమాలు ఉన్నా సరే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉండటంతో నిర్మాతలకు లాభాల పంట పండింది. అయితే థియేటర్లను సరిగా కేటాయించలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. థియేటర్లను కేటాయించకపోవడంతో సినిమాకు కలెక్షన్ లు భారీగా తగ్గాయని, కేటాయించిన థియేటర్లలో కూడా ఒకటి రెండు షోలు మాత్రమే వేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

దీనిపై నందమూరి అభిమానుల సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. భారీగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఖర్చుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ ఈ సినిమా కోసం రెండేళ్ళు కష్టపడడం, రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఉండటం.. ఈ సినిమా తర్వాత బాలయ్యకు పద్మభూషణ్.. అవార్డు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఒక పాట విషయంలో సోషల్ మీడియాలో బాలయ్యను కొంతమంది టార్గెట్ చేశారు.

ఊర్వశి రౌతలతో బాలయ్య వేసిన స్టెప్పులపై అభిమానులు కూడా కొంతమంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు. దబిడి దిబిడే అనే సాంగ్ లో బాలయ్య వేసిన స్టెప్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని.. కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు. అయితే సినిమాలో మాత్రం అలా లేవని, కేవలం ట్రైలర్ చూసి అలా అనుకోవద్దని కొంతమంది సినిమా చూసిన తర్వాత కామెంట్ చేశారు. ఇక దీనిపై హీరోయిన్ ఊర్వశి రియాక్ట్ అయింది. బాలకృష్ణ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని శేఖర్ మాస్టర్ ఆ స్టెప్స్ ప్లాన్ చేశారని.. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అవంత అభ్యంతరకరంగా ఉన్నాయనే విషయం.. తాము ఎవరు అబ్జర్వ్ చేయలేదని ఆమె కామెంట్ చేసింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా ఆ సాంగ్స్ ప్లాన్ చేశాడు శేఖర్ మాస్టర్. ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు.