సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైనట్టే అనే కాన్ఫిడెన్స్ ఫాన్స్ లో ఉంటుంది. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ కావడంతో ఫాన్స్ ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా లో బాలయ్య లుక్స్ కూడా ఫాన్స్ ను ఊపేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా సినిమా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మాస్ ఆడియన్స్ కోసమే ఈ ట్రైలర్ రిలీజ్ చేసినట్టు అనిపించింది. బాలకృష్ణ డైలాగులతో ట్రైలర్ సినిమాపై హైప్ మరీ పెంచేసింది. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారు. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం బాలయ్య రేంజ్ డైలాగులు ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాయలసీమ మాలుమ్ తేరేకు... ఓ మై అడ్డా అనే డైలాగ్ ఫ్యాన్స్ ను ఊపేసింది. ఎవరైనా చదవడంలో మాస్టర్ చేస్తారు. నేను చంపడంలో చేశా... ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. అంటూ బాలయ్య నోటి నుంచి వచ్చిన డైలాగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక ట్రైలర్ కు వ్యూస్ కూడా అదే లెవెల్ లో వెళుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ పై కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా తమన్ కొట్టిన బిజిఎం ఐతే అసలు బాలకృష్ణ కోసమే అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడా అనే ఒపీనియన్ కూడా వచ్చింది జనాలకు. ఈ ట్రైలర్లో డాకు మహారాజ్ పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఒక్కో సీనుకు ట్రైలర్ చూస్తూనే విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. కచ్చితంగా ధియేటర్లో ఈ సినిమా దుమ్ము రేపుతుందని... 200 కోట్లు వసూలు చేయడం పక్కా అని మాస్ ఆడియన్స్ కు కచ్చితంగా కళ్ల పండగే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి రిలీజ్ ట్రైలర్ ను నిన్నే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ తిరుపతిలో జరిగిన ఘటన కారణంగా అది వాయిదా పడింది. ఇక ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించింది. 12వ తేదీ ఉదయం నాలుగు గంటల స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్ తో పాటుగా ఒక్కో టికెట్ 500 కు విక్రయించేందుకు ఓకే చెప్పారు. రోజుకు ఐదు షోలు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మల్టీప్లెక్స్ లో 135 రూపాయలు అదనంగా సింగిల్ థియేటర్స్ లో 110 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ రేట్స్ ఉంటాయి.[embed]https://www.youtube.com/watch?v=Wh98woXo7dg[/embed]