డాకూ మహారాజ్ రివ్యూ: సంక్రాంతి విన్నర్
సంక్రాంతికి బాలయ్య సినిమా అనగానే ఆయన ఫ్యాన్స్ కే కాదు నార్మల్ ఆడియన్స్ కు కూడా పిచ్చి పీక్స్ లో ఉంటుంది. అఖండ సినిమా దగ్గరి నుంచి కథల విషయంలో పక్కా లెక్కలతో ప్లానింగ్ తో వెళ్తున్న బాలయ్య... వరుస హిట్ లు కొడుతున్నారు.
సంక్రాంతికి బాలయ్య సినిమా అనగానే ఆయన ఫ్యాన్స్ కే కాదు నార్మల్ ఆడియన్స్ కు కూడా పిచ్చి పీక్స్ లో ఉంటుంది. అఖండ సినిమా దగ్గరి నుంచి కథల విషయంలో పక్కా లెక్కలతో ప్లానింగ్ తో వెళ్తున్న బాలయ్య… వరుస హిట్ లు కొడుతున్నారు. ఇప్పుడు డాకూ మహారాజ్ తో ప్రేక్షకులకు సంక్రాంతి గిఫ్ట్ గ్రాండ్ గా రెడీ చేసారు బాలయ్య. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఒకసారి రివ్యూ చూస్తే..
మాస్ యాక్షన్ కథలంటే బాలయ్య అనే ఒపినియన్ జనాలకు వచ్చేసింది. అందుకు తగ్గట్టే బాలయ్య సినిమాలు కూడా ఉంటున్నాయి. సినిమా ఎలా ఉన్నా మాస్ ఆడియన్స్ కు పూనకాలు పక్కా అనే ఒపినియన్ వచ్చేస్తోంది. మరి డాకూ మహారాజ్ కూడా అదే రేంజ్ లో ఉందా…? ఒకసారి రివ్యూ చూద్దాం.
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్)విద్యావేత్త. ఆయన ఓ పెద్ద స్కూల్ కు యజమాని. ఆయనకు ఒక కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని లోకల్ ఎమ్మెల్యే(రవి కిషన్) ఒకరు లీజుకు తీసుకుని అక్కడి నుంచి అడవి జంతువులను స్మగ్లింగ్ చేస్తాడు. కాఫీ ఎస్టేట్ వుంటుంది. లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు అరాచకాలు తీవ్రం కావడంతో కృష్ణ మూర్తి పోలీసుల వద్దకు వెళ్తాడు. అక్కడి నుంచి కోపం పెంచుకున్న ఎమ్మెల్యే కృష్ణమూర్తి మనవరాలిని చంపాలని చూస్తాడు. అక్కడి నుంచి బయటపడటానికి.. అదే ఇంట్లో పని చేసే మకరంద్ దేశపాండే చంబల్ లోని మోస్ట్ వాంటెడ్ మహారాజ్ (బాలకృష్ణ)కు కబురు పంపుతాడు. ఆ తర్వాత నుంచి మహారాజ్ తన పేరు మార్చుకుని నానాజీగా ఆ పాపకు డ్రైవర్ గా మారతాడు. అసలు ఆ మహారాజ్ చరిత్ర ఏంటీ…? ఆ పాపకు మహారాజ్ కు ఉన్న లింక్ ఏంటీ… నానాజీగా మహారాజ్ పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది… బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? అనేది కథ.
మాస్ సినిమాలను లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు చూపించడం కచ్చితంగా ఒక సవాల్. బాలయ్య లాంటి మాస్ హీరోకు అయితే అది మరీ టార్చర్. కాని ఈ విషయంలో డైరెక్టర్ బాబీ కొల్లి చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడా కూడా కంగారు పడకుండా ప్రతీ ఒక్కటి జాగ్రత్తగా ప్లాన్ చేసాడు. బాలయ్య కోసమే రాసుకున్న కథ ఇది. మరో డైరెక్టర్ కు అసలు సూట్ అవ్వదు. చంబల్ బ్యాక్ డ్రాప్ కి తీసుకు వెళ్లి.. యాక్షన్ ను వేరే రేంజ్ లో చూపించాడు. స్క్రీన్ ప్లే ఈ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. డాకూ మహారాజ్ కథను చెప్పే విధానమే డిఫరెంట్ గా ఉంటుంది.
ఇంటర్వెల్ కోసం డైరెక్టర్ ప్రాణం పెట్టాడు. స్టార్టింగ్ సీన్ నుంచి ప్రతీ ఒక్కటి వేరే లెవెల్ లో ఉంటుంది. పాత్రలను కూడా చాలా బలంగా చూపించాడు. నానాజీగా బాలయ్య ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్ కు వెళ్తుంది. పాప ఎమోషన్ చూపించే టైం లో కాస్త కథ స్లో గా ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ డాకు గురించి చేసే ఎంక్వైరీ కూడా కథను వేరే లెవెల్ కు తీసుకు వెళ్తుంది. ఫైట్ సీక్వెన్స్ తర్వాత వచ్చే డబిడి దిబిడే సాంగ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సినిమాకు హైలెట్. ఇంటర్వెల్ కు ముందు 20 నిమిషాలు సినిమాను వేరే లెవెల్ కు తీసుకు వెళ్తుంది.
డాకు మహారాజ్ కథకు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనేది సెకండ్ ఆఫ్ లో చూపించారు. నీళ్ళ కోసం చంబల్ లోయలో పడే కష్టాలను చాలా బాగా చూపించారు. ఇంజనీర్ సీతారాం గా బాలయ్య చాలా బాగా కనిపించాయి. ఆయనను డాకూలా మార్చిన పరిస్థితులు కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. సెకండ్ ఆఫ్ లో చూపించే సీన్స్ కొన్ని సినిమాకు హైలెట్. కలెక్టర్ ప్యాలెస్ సీన్, ఇసుక తుఫాన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాను వేరే లెవెల్ కు తీసుకు వెళ్తాయి. క్లైమాక్స్ ను కాస్త సాగదీసిన డైరెక్టర్ కొన్ని సీన్స్ ను రెగ్యులర్ గా చూపించాడు. కొన్ని సార్లు సినిమాలో తర్వాత వచ్చే సీన్ ఏంటీ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. కీలకమైన విలన్ రోల్ ను సెకండ్ హాఫ్ లో చూపించాడు. అది మైనస్ అయింది.
సినిమాలో బాలయ్యను చాలా డీసెంట్ గా చూపించాడు బాబీ. ఓవర్ గా బాలయ్య రోల్ ను ఎలివేట్ చేయలేదు. ఇక డైలాగ్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ లో ఉన్నాయి. ఒక్కో డైలాగ్ కు జనాలకు పూనకాలు ఖాయం. ఆయన క్యారెక్టర్ మేకోవర్ కోసం డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. బాలయ్య ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. ప్రగ్యా జైస్వాల్ తో పోలిస్తే శ్రద్ధా శ్రీనాథ్ కి చాలా మంచి వెయిట్ ఇచ్చారు. బాబీ డియోల్ ను చాలా బాగా చూపించారు. స్టైలిష్ గా కనిపించాడు. ఊర్వశి డాన్స్ కూడా చాలా బాగుంది.
ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య కోసమే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడేమో అనే రేంజ్ లో తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. డాకూ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయింది. చాలా సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో అయితే థియేటర్ బద్దలు కావడం ఖాయం అన్నట్టే ఉంటుంది. ఎలివేషన్ సీన్స్ అన్నిటికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక డీఓపీ విజయ్ కన్నన్ విజువల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. ఎడారిలో తీసిన సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు బాలయ్య యాక్షన్ బలం అని చెప్పాలి. డాకూ యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. అభిమానులకు అయితే సినిమా కచ్చితంగా పండగ అనే చెప్పాలి.