డాకూ టార్గెట్ 250 కోట్లు.. హిందీలో రిలీజ్ నేడే.. ఓటీటీ రిలీజ్ అప్పుడేనా…?
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయింది. సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయింది. సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టడంతో దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ చేశారు. ఇక సినిమా కథలో పట్టు ఉండడంతో నిర్మాతలు కూడా పెట్టుబడి పెట్టే విషయంలో వెనకడుగు వేయలేదు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ కలెక్షన్స్ రావడంతో నిర్మాతలకు లాభాల పంట పండిందనే చెప్పాలి.
ఈ సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్ చూసి నందమూరి అభిమానులతో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా ఊగిపోయారు. సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే భారీగా వసూళ్లు వచ్చాయి. అమెరికాలో కూడా ఈ సినిమా దుమ్మురేపిందనే చెప్పాలి. ఇక తెలుగులో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా తమిళంలో కాస్త లేటుగా రిలీజ్ అయి హిట్టు కొట్టింది. ఇక ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా శుక్రవారం నుంచి హిందీలో రిలీజ్ చేశారు.
ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డేకాయిట్ గా మారి ఒక గ్రామాన్ని ఏ విధంగా కాపాడుతాడు అనే కాన్సెప్ట్ తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను.. సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ప్లాన్ చేయగా.. ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంది. సినిమా సూపర్ హిట్ కావడంలో తమన్ కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా రిలీజ్ అవ్వటానికి రెడీ అయిపోతుంది. అది కూడా వచ్చే నెలలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సినిమా రిలీజ్ అయిన సరిగా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వటానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటిటీ హక్కులను ఇప్పటికే నెట్ఫ్లిక్స్ కొనుక్కుంది. అతి త్వరలో ఈ సినిమాను స్ట్రీమింగ్ తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. హిందీ వర్షన్ కోసం ఒక 20 రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చేనెల 10వ తారీఖున ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది దాదాపు 190 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ తన కెరీర్ లో వరుసగా నాలుగు సార్లు 100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయిన తర్వాత 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం ఖాయమని కాలర్ ఎగరేస్తున్నారు ఫాన్స్.