డేంజర్ జోన్ లో వార్ 2.. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి అదే అతిపెద్ద సవాల్..!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన మొదటి బాలీవుడ్ సినిమా వార్ 2తో బిజీగా ఉన్నాడు. విడుదల వరకు ఇదే సినిమాతో జర్నీ చేయబోతున్నాడు జూనియర్. అయన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. RRR సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు రావడంతో.. వార్ సీక్వెల్ కోసం తారక్ ను

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన మొదటి బాలీవుడ్ సినిమా వార్ 2తో బిజీగా ఉన్నాడు. విడుదల వరకు ఇదే సినిమాతో జర్నీ చేయబోతున్నాడు జూనియర్. అయన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. RRR సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు రావడంతో.. వార్ సీక్వెల్ కోసం తారక్ ను ఒక హీరోగా తీసుకున్నాడు అయన్ ముఖర్జీ. స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా వస్తుంది.
అంతా బాగానే ఉంది కానీ వార్ 2 ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది. ఈ కష్టాలు దర్శక నిర్మాతలతో పాటు హీరోలను కూడా భయపెడుతున్నాయి. దాంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. లేక లేక జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిపోతే.. దానికి ఎన్నో సవాళ్లు ముందు నుంచి టెన్షన్ పెడుతున్నాయి.
ఇండియన్ స్క్రీన్ పై ఒకప్పట్లా ఇండియా, పాకిస్తాన్ కథలకు డిమాండ్ తగ్గిపోయింది. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధానంగా చేసిన సినిమాలు ఇండియాలో కాసుల వర్షం కురిపించాయి. బజరంగీ భాయిజాన్ దగ్గర నుంచి నిన్న మొన్నటి పఠాన్ వరకు వందల కోట్లు వసూలు చేశాయి.. కానీ ఇప్పుడు ఇండో పాక్ కథలకు ఆ రేంజ్ డిమాండ్ కనిపించడం లేదు. గతేడాది విడుదలైన ఫైటర్ కనీసం వచ్చినట్టు కూడా ఆడియన్స్ కు ఐడియా లేదు. వార్, పఠాన్ లాంటి సినిమాలు తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ దీనికి దర్శకుడు. ఇండియా, పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన కథ ఇది. దీనికి కేవలం 300 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చాయి. అందులోనూ షేర్ 200 కోట్లు కూడా లేదు. ఇది మాత్రమే కాదు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ 3 పరిస్థితి కూడా ఇంతే. మన అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్కై ఫోర్స్ కూడా ఇండో పాకిస్తాన్ నేపథ్యంలోనే వచ్చింది.
ఈ 3 సినిమాల ఫలితాలు చూసిన తర్వాత వార్ 2 ఎలా ఉండబోతుందో అనే కంగారు అందరిలోనూ కనిపిస్తోంది. ఒకవేళ ఇది కూడా ఇండియా, పాకిస్తాన్ నేపథ్యంలోనే వస్తే దర్శకుడు అయన్ ముఖర్జీ దానికోసం చాలా పెద్ద మ్యాజిక్ చేయాల్సి వస్తుంది. ఏదో రొటీన్ స్టోరీ చేస్తే మాత్రం వార్ సీక్వెల్ నిరాశ పరచడం ఖాయం. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి హీరోలు ఉన్నా కూడా కథలో చాలా బలం ఉంటే కానీ ఈ సినిమా వర్కౌట్ అవ్వడం కష్టం. మరి ఈ సవాళ్లు దర్శకుడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.