ధనుష్ నువ్వు మనిషివా మానవ మృగానీవా…? ఇన్ని సినిమాలా…?
ఏ హీరో అయినా ఒకటి రెండు సినిమాల్లో నటించడం ఇప్పుడున్న పరిస్థితిలో గొప్ప. అలాంటిది ఏకంగా పది సినిమాలు ఓ స్టార్ హీరో లైన్ లో పెట్టడం అంటే...? ఇట్స్ నాట్ ఏ జోక్ కదా...? ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ఏకంగా పది సినిమాలను లైన్ లో పెట్టేసాడు.
ఏ హీరో అయినా ఒకటి రెండు సినిమాల్లో నటించడం ఇప్పుడున్న పరిస్థితిలో గొప్ప. అలాంటిది ఏకంగా పది సినిమాలు ఓ స్టార్ హీరో లైన్ లో పెట్టడం అంటే…? ఇట్స్ నాట్ ఏ జోక్ కదా…? ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ఏకంగా పది సినిమాలను లైన్ లో పెట్టేసాడు. ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న హీరో ధనుష్ అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో. ఇవి కాక మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు. వీటిల్లో తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే ‘కుబేర’ సినిమా ఒకటి.
ఇది దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇసైజ్ఞాని అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇది ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే ‘ఇళయరాజా’ బయోపిక్. అలాగే తాను నిర్మిస్తున్న సినిమాల్లో కూడా ధనుష్ నటిస్తున్నాడు. ఇడ్లీ కడాయ్ అనే సినిమాను నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నాడు. అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత హిందీలో తేరే ఇష్క్ మే అనే సినిమా కూడా చేస్తున్నాడు. వీటిల్లో త్వరలోనే కుబేర సినిమాతో పాటుగా తాను నిర్మించి దర్శకత్వం వహించిన నీక్ అనే సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది.
ఇక్కడి నుంచి ధనుష్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయినట్టే. కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తో ఓ సినిమా లైన్ లో పెట్టాడు. ‘పోర్‌తొళిల్’ సినిమా చేసిన యువ డైరెక్టర్ విఘ్నేష్ రాజా తో ఒక సినిమా చేస్తున్నాడు. తమిళరసన్ పచ్చముత్తు, మారి సెల్వరాజ్, అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియసామి, మంజుమ్మల్ బాయ్స్ ఫేం చిదంబరం డైరెక్టర్స్ తో సినిమాలు లైన్ చేసాడు. అలాగే తన అన్నతో కూడా ఒక సినిమా ప్లాన్ చేసి రెడీ అవుతున్నాడు.
తన అన్న సెల్వ రాఘవన్ తో పుదు పెట్టే2 సినిమా చేస్తున్నాడు. అలాగే మహారాజా ఫేం నిథిలన్ స్వామి నాథన్ తో ఒకటి… తునీవు, వాలిమై ఫేం H. వినోద్ తో మరో రెండు సినిమాలు లైన్ చేసుకున్నాడు. ఒక్కో షెడ్యూల్ లో మూడు సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ గ్యాప్ లోనే తాను నటిస్తూ, డైరెక్షన్ చేస్తూ నిర్మిస్తూ సినిమాలు చేస్తున్నాడు. మరి ఇంత స్పీడ్ గా సినిమాలు చేయడానికి కారణం ఏంటో ధనుష్ కే తెలియాలి. కథ నచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సినిమాకు సైన్ చేసేస్తున్నాడు. యువ రచయితల దగ్గర కథలు కొంటున్నాడు.