Dasara Actress: డాన్స్ ఇరగదీసింది..సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్..

రెండవ సినిమాతోనే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాలో ఆమె నటన అద్భుతం. అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరపించింది. ఇక ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2023 | 09:30 AMLast Updated on: Apr 05, 2023 | 9:30 AM

Dasara Actress Keerthi Suresh Dance

గతేడాది సర్కారు వారి పాట సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రూపొందించిన లేటేస్ట్ చిత్రం దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురష్ నటించగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో నటించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాకు యూత్‏కు బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా.. నాని లోకల్ తర్వాత కీర్తి, నాని కాంబోలో వచ్చిన సెకండ్ సినిమా ఇది.

ఈ సినిమాలో నాని మాస్ లుక్ తో ధరణి పాత్రలో నటించగా.. గ్రామీణ యువతి వెన్నెల పాత్రలో కనిపించింది కీర్తి. ఈ సినిమాలో ఆమె పోషించిన వెన్నెల పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఆమె పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో పెళ్లి కూతురుగా కీర్తి సురేష్ బ్యాండు మేళం ముందు మాస్ డ్యాన్స్ చేస్తుంది. చూడటానికి ఇది చిన్న బిట్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలోనే కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. థియేటర్లలో ఆమె మాస్ డాన్స్ తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. ఇప్పటికే కీర్తి మాస్ డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

తాజాగా కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అందులో బ్యాండు మేళం ముందు కీర్తి పక్కా మాస్ డాన్స్ తో అదిరగొట్టింది. విడుదలైన క్షణాల్లోనే నెట్టింట వైరలయ్యింది కీర్తి. దీంతో ఆ ఎనర్జీ ఏంటమ్మ కీర్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.