దసరా, భోళా పబ్లిక్ టాక్ లో అది.. మరీ వీక్..

దసరా మూవీ లో నాని లుక్కు పుష్పతో పోల్చారు.. కాని పుష్పకంటే కూడా రస్టిగ్ గా మాసీగా కనిపించాడు నాని. ఇక కథ, కథనాలు అన్నీ పూర్తి భిన్నం. పుష్పలో చందనం స్మగ్లింగ్ అయితే, ఇక్కడ బొగ్గు స్మగ్లింగ్ అన్నారు. కాని ఫస్ట్ హాప్ ఊగిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2023 | 08:00 PMLast Updated on: Mar 30, 2023 | 8:00 PM

Dasara Bhola Music Week

జెర్సీ రేంజ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో నాని ఆకట్టుకుంటే, మహానటి రేంజ్ పెర్ఫామెన్స్ తో కీర్తి దుమ్ముదులిపింది. ఐతే దసరా ఫస్ట్ హాఫ్ బాగుంది. కాని సెకండ్ హాఫ్ స్లో గా సాగతీతగా ఉండటం, పాటలు అంతంతాగానే ఆకట్టుకోవటంతో సీన్ మారుతోంది. ధూం ధాం, ఓ వదినే సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ ఉంటే నెక్ట్స్ లెవల్ లో రిజ్ల్ కూడా ఉండేదనే మాటే వినిపిస్తోంది.

దసరా సెకండ్ హాఫ్ సోసోగా ఉన్నా క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లాక్ చేసేలా ఉండటంతో, ఆడియన్స్ అక్కడ శాటిస్ ఫ్యాక్షన్ తో ఇంటికెల్లే ఛాన్స్ ఉంది. అదే రిపీట్ ఆడియన్స్ ని, మౌత్ టాక్ ని పెంచే అవకాశం ఉంది. ఇక ఖైదీ రీమేక్ అయిన భోలా విషయానికొస్తే, యాజ్ ఇట్ ఈజ్ ఖైదీనే దింపేశారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ పాత్రలో టబుని పెట్టి ఫీమేల్ రూట్లో చిన్న చిన్న మార్పులతో ఖైదీని దింపేశారు. కాకపోతే ఖైదీ రేంజ్ మ్యాజిక్ మిస్ అవుతోంది. నార్త్ లో ఓకే, కాని సౌత్ లో హిందీ భోళాకి ఓమాదిరీ రెస్పాన్సే దక్కుతోంది. మొత్తంగా దసరా, భోళా రెండీంట్లో మ్యూజిక్ వీక్ అనే టాక్ పెరుగుతోంది.