Dasara: దుమ్ములేపుతున్న చమ్కీల అంగీ సాంగ్.. అసలు ఎవరీ సింగర్ ‘ధీ’.
కొందరు సింగర్స్ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. సాంగ్ లిరిక్స్ సంగతి పక్కన పెడితే వాళ్ల వాయిస్ చాలు సాంగ్‌ను హిట్ చేయడానికి. వాళ్ల పేరు ఎవరికీ తెలియకపోయినా సరే.. పాట వినగానే ఆ సింగర్ సాంగ్స్ అన్ని లిస్ట్ చెప్తుంటారు. ఎలాంటి వర్సటాలిటీ లేకున్నా.. వాయిస్‌తో మ్యాజిక్ చేస్తుంటారు. అలాంటి సింగరే దీక్షిత. సింపుల్‌గా 'ధీ' అని అంతా పిలుస్తుంటారు.
కొందరు సింగర్స్ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. సాంగ్ లిరిక్స్ సంగతి పక్కన పెడితే వాళ్ల వాయిస్ చాలు సాంగ్‌ను హిట్ చేయడానికి. వాళ్ల పేరు ఎవరికీ తెలియకపోయినా సరే.. పాట వినగానే ఆ సింగర్ సాంగ్స్ అన్ని లిస్ట్ చెప్తుంటారు. ఎలాంటి వర్సటాలిటీ లేకున్నా.. వాయిస్‌తో మ్యాజిక్ చేస్తుంటారు. అలాంటి సింగరే దీక్షిత. సింపుల్‌గా ‘ధీ’ అని అంతా పిలుస్తుంటారు.
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న దసరా సినిమాలో చక్కీల అంగీలేసి సాంగ్ పాడింది ఈ సింగరే. గత వారం రోజుల నుంచి ఈ సాంగ్ ఇటర్నెట్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు సగం రీల్స్ చమ్కీల సాంగ్‌తోనే ఉంటున్నాయి. పాడింది తక్కువ పాటలే అయినా.. లక్షల మంది మదిని దోచుకుంది ధీ. దసరా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కూతురే ఈ సింగర్ ధీ. ఈమె పేరు తెలియకపోయినా ఈమె పాడిన పాడిన పాటలు చాలా మందికి తెలుసు. కాటుక కనులే, రౌడీ బేబీ, ఓ సక్కనోడా సాంగ్స్ పాడింది కూడా ఈమె.
కేవలం సినిమాలే కాదు చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది ధీ. తన 14 ఏట నుంచి పాటలు పాడటం ప్రారంభించింది. మొదటి పాటే.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌తో పాడి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సుమారు 25 సినిమాల్లో ధీ పాటలు పాడితే.. అందులో దాదాపు సగానికి పైగా సినిమాలకు ధీ తండ్రి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా తండ్రి సారథ్యంలో సాంగ్స్ పాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ధీ. తెలుగులోనే కాదు తమిల్‌లో కూడా చాలా సాంగ్స్ పాడింది. భాష ఏదైనా ధీ సాంగ్ పాడింది అంటే ఆ సాంగ్ హిట్ అవ్వాల్సిందే. ఇంటర్నెట్‌లో వైరల్ కావాల్సిందే. అప్పట్లో ఈమె పాడిన రౌడీ బేబీ సాంగ్ కూడా యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ సాధించింది. ఇప్పుడు చమ్కీల అంగీలేసి సాంగ్ కూడా అలాగే దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సాంగ్ 15 మిలియన్ వ్యూస్ దాటేసింది.