Dasara: బూతు పురాణం.. ! అది బూతే కాదంటే ఎలా..?

నాని మూవీ కి 19 కట్లు, లేదు 26 కట్లు, కాదు 32 కట్లు పడ్డాయి. చాలా డైలాగ్స్ కి సెన్సార్ కత్తెరేసింది అన్నారు. ఐతే ఇందులో కొన్ని బూతు పదాలు నార్మల్ గా వాడేశారని, అది బూతుగా అనుకోవద్దని దర్శకుడు రిక్వెస్ట్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2023 | 11:58 PMLast Updated on: Mar 27, 2023 | 11:58 PM

Dasara Movie Number Of Censor Cuts

బాంచన్ అనే పదం వేరు, బాంచత్ అనే పదం వేరంటూ దర్శకుడి వివరణ సెన్సార్ టీం ని మెప్పించలేకపోయిందట. నిజానికి బాంచత్ అనే పదం తెలంగానలో ఇరిటేషన్ ని, లేదంటే ఛాలెంజ్ చేసేప్పుడు వాడే పదం అనే అభిప్రాయం ఉంది. అంతమాత్రానికే అది బూతవుతుందా అని నానితో సహా దర్శకుడు కూడా ప్రచారం చేస్తున్నారు

కత్తిని చంపడానికి కాకపోయినా చేతిలో పట్టుకుని తిరిగితే, ఆయుధంగానే పరిగనించాలి.. అలానే బాంచత్ అనే పదం నిజంగా తెలుగు పదం కాదు. నార్త్ లో విరివిగా వాడే ఓ బూతు.. కాని తెలంగాణలో ఆ అర్ధాన్ని వదిలేసి, అదో సౌండ్ గా ఛాలెంజ్ చేసే సందర్భాల్లో వాడతారు.. అలా సందర్భానుసారంగా చూస్తే అది బూతుకాదనేది నాని అండ్ కో వాదన.. కాకపోతే, ఎలా వాడుతున్నారనే కంటే, పదం మూలం, అర్ధం ఖచ్చితంగా సెన్సార్ టీం పరిగనలోకి తీసుకుంటుంది.. కాబ్టటి నార్మల్ గా వాడినా, మంచి ఉద్ధేశ్యంతో వాడినా అర్ధం పరంగా బూతు బూతే అవుతుంది కాబట్టే, సెన్సార్ టీం ఆ పదం వాడిన డైలాగ్స్ ని కత్తిరించాల్సి వచ్చిందట..