Dasara Collections: 500 కోట్ల దసరా.. ధరణి మరో పుష్పరాజ్..
దసరా మూవీ రెండు రోజుల్లో 53 కోట్లు రావటం కాదు మూడో రోజు కలెక్షన్లు, నాలుగో రోజు వసూళ్లు ఇలా లెక్కేస్తే 40 రోజుల్లో 500 కోట్ల కలెక్షన్లు రావటం ఖాయమౌతోంది. మరో పుష్పరాజ్ అనేశారు. ఇంకా సౌత్ లో తక్కువ కాని, హిందీ రాష్ట్రాల్లో అయితే పుష్పని మించేలా దుమ్ముదులుపుతోంది. టాక్ అలా ఉంది.

Pushpa Dasara KgF
పుష్పలో హీరోయిజం మాత్రమే సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళితే, దసరాలో పాత్రలు, స్నేహం, ప్రేమ, దీనికి తోడు కల్చర్ తో లింకైన సీన్లు నార్త్ జనానికి తెగ ఎక్కేసినట్టు తెలుస్తోంది. ఏదో నాని మరీ నాటుగా కనిపిస్తే, పుష్పని చూసి ఫాలో అయ్యారనుకున్నారు. కాని ఫైనల్ టాక్ వేరే లెవల్..
ఇక ఇక్కడ మరో పోలిక ఏంటంటే, కాంటారా, పుష్ప, కార్తికేయ 2, లాంటిదే దసరా అంటున్నారు.కారణం బాహుబలి క్రియేట్ చేసిన సెన్సేషన్ వల్ల భారీ బడ్జెట్ వల్ల త్రిబుల్ ఆర్ కి రిలీజ్ టైంలో ఓరేంజ్ హైప్ వచ్చింది. కేజీయఫ్ 2 కి బడ్జెట్ తోపాటు ఛాప్టర్ వన్ సక్సెస్ వల్లే ఆ రేంజ్ ప్రమోషన్ దక్కింది. కాని ఎలాంటి హంగామాలేకుండా తక్కువ బడ్జెట్ లో కాంటారా, కార్తికేయ 2 దుమ్ముదులిపాయి. పుష్ప 2 కూడా అలాంటి సెన్సేషనే క్రియేట్ చేసింది. ఇప్పుడు దసరా ఆ జాబితాలోకి చేరినట్టే అంటున్నారు.