Dasara: నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో దసరా ఒరిజినల్ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
థియేటర్లలో ఇంకా విజయవంతంగా నడుస్తున్న దసరా మూవీ ఓటీటీ డీల్ నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. నాని అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది నెట్‌ఫ్లిక్స్.
Dasara: నేచురల్ స్టార్ నాని రీసెంట్ బ్లాక్‌బస్టర్ దసరా మూవీ. థియేటర్లలో ఇంకా విజయవంతంగా నడుస్తున్న ఈ మూవీ ఓటీటీ డీల్ నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. నాని అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది నెట్‌ఫ్లిక్స్.
ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో దసరా సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీలో దసరా ఒరిజినల్ వెర్షన్ రాబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా ఒరిజినల్ వెర్షన్‌కు, థియేటర్లో రిలీజైన వెర్షన్‌కు చాలా తేడా ఉంది. ఈ సినిమాలో వయొలెంట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో చాలా వరకూ సెన్సార్‌లో పోయింది. చాలా సీన్స్‌కు బ్లర్ కూడా వేశారు. కానీ ఓటీటీలకు ప్రస్తుతానికిఇలాంటి రూల్స్ ఏమీ లేవు. సెన్సార్ లేకపోవడంతో దసరా సినిమా ఒరిజినల్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నట్టు సమాచారం. సినిమా పూర్తైన తరువాత సెన్సార్‌లో దాదాపు 12 నిమిషాల సినిమా కట్ అయ్యింది.
వైల్డ్ సీన్స్ కారణంగా ఈ 12 నిమిషాలను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. ఇప్పుడు ఆ సీన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న వెర్షన్లో ఉండనున్నాయి. దీంతో సినిమా రన్ టైం కూడా పెరుగుతుంది. ఈ అప్డేట్తో నాని ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం అని మేకర్స్ చేప్తున్నారు. నాని కెరీర్లో దసరా మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందింది. అది కూడా డెబ్యూ డైరెక్టర్ అవ్వడంతో నాని ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారని అప్పట్లో చాలా మంది అన్నారు.. కానీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూశాక చాలా మంది వాళ్ల ఓపీనియన్ మార్చుకున్నారు. రిలీజయ్యాక సినిమా బ్లాక్‌బస్టర్ అయి, నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. ఫస్ట్ వీక్‌లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.