Pushpa 2 : ఇలా అయితే కష్టమేనా

డెడ్లీ కాంబినేషన్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలిసి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2024 | 12:00 PMLast Updated on: Jun 08, 2024 | 12:00 PM

Deadly Combination Allu Arjun And Sukumar Are Getting Ready To Shake The Box Office Once Again

 

 

డెడ్లీ కాంబినేషన్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలిసి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. పుష్ప2 (Pushpa 2) తో పాన్ ఇండియా (Pan India) లెవల్లో దుమ్ముదులిపేయాలని చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబో.. ఈసారి పార్ట్ 2తో వెయ్యి కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న పుష్ప2 కోసం మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ (Bollywood) ఆడియెన్స్.. పుష్పరాజ్ థియేటర్లోకి రావడమే లేట్ అన్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప2 టీజర్, పుష్ప పుష్ప సాంగ్, కపుల్ సాంగ్ అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తి అయ్యింది. ప్రస్తుతం క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఐటెం సాంగ్ షూట్ చేయనున్నారట. ఈ సాంగ్‌లో యానిమల్ హాట్ బ్యూటీ తృప్తి డిమ్రి, బన్నీతో చిందేయనుందని అంటున్నారు.అయితే.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమాకు రీ షూట్ చేస్తున్నారనే వార్తలు మాత్రం వైరల్ అవుతునే ఉన్నాయి. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. పుష్ప2 అవుట్ ఫుట్ చూసిన తర్వాత సుకుమార్ అంత సంతృప్తిగా లేడని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను మరోసారి రీ షూట్ చేయనున్నట్లుగా సమాచారం.

మామూలుగానే.. తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు షూటింగ్ చేస్తునే ఉంటాడు సుకుమార్. ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుండగా.. ఆగష్టు 1 వరకు షూటింగ్ జరగనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కానీ పుష్ప2 పై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి