Allu Arjun – Deepika : బన్నీతో దీపికా చిందులు..
పుష్ప (Pushpa) భారీ విజయంతో మంచి జోరు మీదున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇక.. గుంటూరు కారం (Guntur Karam) సినిమా మిక్స్‌డ్ రిజల్ట్ తర్వాత.. గురూజీ త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ తన నెక్ట్స్ మూవీని బన్నీతో తీయబోతున్నాడు..

Deepika Chindulu with National Award Winner Pan India Hero Icon Star Allu Arjuna
పుష్ప (Pushpa) భారీ విజయంతో మంచి జోరు మీదున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇక.. గుంటూరు కారం (Guntur Karam) సినిమా మిక్స్‌డ్ రిజల్ట్ తర్వాత.. గురూజీ త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ తన నెక్ట్స్ మూవీని బన్నీతో తీయబోతున్నాడు.. గుంటూరు కారం ఇచ్చిన ఘాటు రిజల్ట్‌తో డిజప్పాయింట్ అయిన త్రివిక్రమ్.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో తీయబోయే ప్రాజెక్టుపై ఫుల్ కాన్‌సెన్‌ట్రేషన్ పెట్టాడు.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.. ఈ మూవీలో బన్నీకి జోడీగా ఓ బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్‌ని ఫిక్స్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది..
త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ మూవీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక.. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.. బన్నీ స్టైల్‌కి .. దీపికా బ్యూటీ యాడ్ అయితే.. ఆ లెక్కే వేరప్పా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఇక.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే.. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి,అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌లు ఉన్నాయి. ఇప్పుడు నాలుగోసారి బన్నీ– గురూజీ మరోసారి జత కట్టారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. తమ నాలుగో చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేయడమే కాకుండా.. భారీ హిట్‌ను కూడా కొట్టాలని త్రివిక్రమ్ గట్టిగా ఫిక్సయ్యాడట.