Adipurush: సినిమా సీత మీద సీరియల్ సీత ఫైర్… అక్కడితో ఆగలేదు..
ఆదిపురుష్ మూవీకి ఎన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నా, యాంటీ ఫ్యాన్స్ తో పాటు కొన్ని అనుకోని సంఘటనలు కూడా డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నాయి. తిరుపతిలో కృతి సనన్ ని డైరెక్టర్ ఓం రైత్ కిస్ చేయటం వల్ల పెరిగిన క్రిటిసిజమ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ వెండితెర నటి ప్రవర్తనని బుల్లితెర సీత తప్పు పట్టింది.

Deepika fire on kritisanonDeepika fire on kritisanon
సీత లాంటి పాత్ర వేసిన వ్యక్తి ఎంతో పద్దతిగా ఉండాలని, ఆ పాత్ర వేసినందుకే జనం దేవతతో సమానంగా కొలుస్తారని, కాబట్టి సీతగా కనిపించిన వ్యక్తి అది కేవలం పాత్రగానే అర్ధం చేసుకుంటే పొరపాటే అంది బుల్లితెర సీత దీపికా.
తను సీతగా నటిస్తున్నప్పుడు పేరు పెట్టి పిలవటం లాంటివే చేయలేదని, తనని దేవతలా చూశారని, కొందరైతే కాళ్లకు నమస్కారాలు చేశారని, కాబట్టి కొన్ని పాత్రలు కేవలం పాత్రలుగా భావించరాదని, ఆవిషయలో సీత పాత్రకి క్రుతి సెట్ అవలేదంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ పండితుడు మొన్న కృతి సనన్ మీద ఇలానే ఫైర్ అయ్యాడు. ఇప్పడు బుల్లి తెర రామాయణంలో సీతగా చేసిన దీపికా ఇలానే ఫైర్ అయ్యింది. ఇలా రోజుకో వ్యక్తి సీతమీద ఫైర్ అవటం ఓ సీరియల్ లా సాగుతోంది. ఇది ప్రమోషన్ గా పనికొస్తుందనుకోవాలో, సీత పాత్ర మీద ప్రభావం చూపిస్తుందనుకోవాలో తేల్చుకోలేకపోతోంది ఆదిపురుష్ టీం.