Deepika Padukone: ప్రెగ్నెన్సీ పుకార్లు.. తల్లి కాబోతున్న దీపికా పదుకొనే..?
దీపికా పదుకొణె బాఫ్తా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో చీరలో తళుక్కుమంది. అయితే సరిగ్గా గమనిస్తే ఆమెకు బేబీ బంప్ ఉందా అని చాలా మందికి అనుమానం వచ్చింది. వేడుక నుంచి తిరిగి వచ్చిన తర్వాత, దీపిక వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది.
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తల్లి కాబోతుందా అంటే అవుననే అంటున్నారు. ఏజ్ పెరిగిపోతున్నా.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కొట్టేస్తోంది ఈ బ్యూటీ. ముద్దుసీన్లు, బెడ్ సీన్లలో రెచ్చిపోతోంది. పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిన ఈబ్యూటీ గురించి ఓన్యూస్ వైరల్ అవుతోంది. బెంగళూరులో పుట్టిన దీపిక.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. బాలీవుడ్‌లో దాదాపు అందరు సూపర్ స్టార్లతో నటించిన దీపిక ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్నారు.
ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన
హిందీలో సింగం రిటర్న్స్ చేస్తోంది. తాజాగా దీపికా పదుకొణె బాఫ్తా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో చీరలో తళుక్కుమంది. అయితే సరిగ్గా గమనిస్తే ఆమెకు బేబీ బంప్ ఉందా అని చాలా మందికి అనుమానం వచ్చింది. వేడుక నుంచి తిరిగి వచ్చిన తర్వాత, దీపిక వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. దీంతో దీపిక గర్భవతి అనే రూమర్ బయటకు వచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక.. ఈ ఏడాది పిల్లలు ప్లాన్ చేసుకుంటామంటూ హింట్ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది పిల్లలు కనేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ చివరి దశలో ఉన్నాయి. పైగా బ్యూటీ బేబీ బంప్‌తో కనిపించడం, ప్రెగ్నెన్సీ పుకార్లు రావడం చూస్తుంటే త్వరలోనే ఆమె శుభవార్త చెబుతుందని భావిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది దీపికా పదుకొనే. పెళ్ళైన ఆరేళ్లకు ప్రెగ్నెంట్ అయ్యింది అన్న వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియాలి అంటే అనౌన్స్‌మెంట్ వరకూ వేచిచూడాల్సింది.