Deepika Padukone: తెలుగు సినిమాల్లో దీపికాకు బంపర్ ఆఫర్స్.. వరుస సినిమాలతో బిజీ..
ఆల్రెడీ కల్కి 2898లో ప్రభాస్‌తో జోడీ కట్టిన దీపికా.. తెలుగులో రెండో మూవీ బన్నీతో చేస్తోంది. ఇక మూడో మూవీ దేవరనే అని తెలుస్తోంది. ఆల్రెడీ దేవర పార్ట్-1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే.. సీక్వెల్‌లో మాత్రం తారక్ సరసన దీపిక మెరవటం కన్పామ్ అయిపోయింది.

Deepika Padukone: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కనిపించబోతోంది. ఇది ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయిన జోడీనే. రీసెంట్‌గా దీపికాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ వినిపించటంతో మ్యాటర్ లీకైంది. అది కూడా కల్కి సెట్లో ఈ సంఘటన జరిగింది. ప్రభాస్ లేని కొన్ని గ్రీన్ మ్యాట్ షాట్ల షూటింగ్ కోసం వచ్చిన దీపికాకు త్రివిక్రమ్ కథ వినిపించాడు. ఈ కథ విని దీపిక ఓకే చేసింది. ఏప్రిల్ నుంచి త్రివిక్రమ్ మేకింగ్‌లో బన్నీ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.
ఆల్రెడీ కల్కి 2898లో ప్రభాస్‌తో జోడీ కట్టిన దీపికా.. తెలుగులో రెండో మూవీ బన్నీతో చేస్తోంది. ఇక మూడో మూవీ దేవరనే అని తెలుస్తోంది. ఆల్రెడీ దేవర పార్ట్-1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే.. సీక్వెల్‌లో మాత్రం తారక్ సరసన దీపిక మెరవటం కన్పామ్ అయిపోయింది. ఇదే కాదు దీపికా తెలుగులో నాలుగో మూవీని కూడా పట్టేసింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ తోనే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో దీపికా జోడీ కన్ఫామ్ అయ్యేలా ఉంది. పుష్ప 2తో బిజీ అయిన సుకుమార్.. ఆతర్వాత చరణ్‌తో సినిమా ప్లాన్ చేశాడు. అందులో దీపికా పదుకొనే హీరోయిన్ అంటున్నారు. ఎలా చూసినా ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా నలుగురు తెలుగు హీరోలతో జోడీ కట్టబోతోంది దీపిక.
అందరూ పాన్ ఇండియా స్టార్ హీరోలే అవటం, అందరికి దీపికా పదుకొనే హీరోయిన్ అవటం యాధృచ్చికం కాదని తెలుస్తోంది. నార్త్ ఇండియా మార్కెట్ కోసం.. అలానే ఆ నాలుగు మూవీల్లో హీరోయిన్ పాత్రకు ఫైట్లు చేసే స్కిల్స్ అవసరం అవటంతో అంతా దీపికాకే ఓటేశారట.