Kalki deepika : క‌ల్కి కోసం దీపికా కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ …

ఇప్పుడంతా పాన్ ఇండియా (Pan India) సినిమాలదే హవా నడుస్తోంది..ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడే బహు భాషల్లో నిర్మించడం కూడా ఇప్పుడు ట్రెండ్​గా మారింది.. ఇప్పుడు దర్శకుడు నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) మరొక అడుగు ముందుకు వేసి.. భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్​కు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ‘

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 10:06 AMLast Updated on: Feb 12, 2024 | 10:06 AM

Deepikas Eye Catching Remuneration For Kalki

ఇప్పుడంతా పాన్ ఇండియా (Pan India) సినిమాలదే హవా నడుస్తోంది..ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడే బహు భాషల్లో నిర్మించడం కూడా ఇప్పుడు ట్రెండ్​గా మారింది.. ఇప్పుడు దర్శకుడు నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) మరొక అడుగు ముందుకు వేసి.. భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్​కు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఫిల్మ్​తో పాన్ వరల్డ్ ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అవుతున్నారు.. సలార్ లాంటి భారీ హిట్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో..ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇక.. ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా భాగమవడం.. మరింత హైప్‌ను పెంచుతోంది.. అయితే.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ దీపికా పదుకొనె రెమ్యూనరేషన్ విషయంలో ఓ లేటెస్ట్ టాక్ వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె కళ్లు చెదిరే రీతిలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

భారీ హైప్‌ మధ్య తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా కోసం హైయెస్ట్ రెమ్యూన‌రేష‌న్‌ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ కోసం అమ్మడు ఏకంగా 20 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అంతేకాదు.. ఇది దీపికా కేరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అని కూడా అంటున్నారు.. గతంలో ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 12 నుండి 15 కోట్ల వరకు రెమ్యూన‌రేషన్ తీసుకునేదట.. అయితే.. కల్కి సినిమా కోసం మాత్రం భారీగా రెమ్యూనరేషన్ పెంచేసి ఏకంగా 20 కోట్లు తీసుకోవడం ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే.. ఈ మూవీ చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది.. దీంతో.. ‘కల్కి’ కోసం భారీగా కాల్షీట్లు కేటాయించాల్సి రావడంతోనే దీపికా 20 కోట్లు డిమాండ్ చేసిందంటున్నాయి సినీ వర్గాలు .. ఈ మూవీలో దీపికాది కీలక పాత్ర కావడం, నార్త్​లో ఆమెకు భారీ మార్కెట్ ఉండటంతో నిర్మాతలు కూడా ఈ డిమాండ్​కు ఓకే చెప్పారని బాలీవుడ్​లో టాక్ నడుస్తోంది..

సైంటిఫిక్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్( Scientific Futuristic Film) ​గా రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.. ఇక‌ ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ వంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా భాగమయ్యారు.. వారున్నారు. క‌ల్కి చిత్రం మే 9న అభిమానుల ముందుకు రానుంది.. మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఈ ఫిల్మ్​ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.. వరల్డ్ వైడ్​గా సుమారుగా 22 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందులో ఇంగ్లీష్​ కూడా ఉంది.. ఇక.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్లుగా.. హాలీవుడ్ స్టాండర్డ్స్​లో రూపొందుతున్న ఈ ఫిల్మ్​ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు.. మరి.. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తోన్న ఈ మూవీ.. రిలీజ్ తర్వాత ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే..