3 సార్లు గ్లోబల్ టాప్ 10 లో దేవర.. రిలీజై 60 రోజులైనా రికార్డులకు బ్రేక్ లేదు..
దేవర విడులై ఇప్పటికి రెండు నెల్లు పూర్తైంది. ఈమూవీ విడుదలై 60 రోజులు దాటుతున్న సందర్భంగా బాంబు పేల్చింది ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఆల్రెడీ దేవరి ఓటీటీని ఏలుతోంది. సౌత్ లో ఒక ఓటీటీ, హీందీ ఇంగ్లీష్ తో పాటు పోర్చుగీసు, స్పానీష్ లో మరో ఓటీటీ దేవర పుణ్యమాని పండగ చేసుకున్నాయి.
దేవర విడులై ఇప్పటికి రెండు నెల్లు పూర్తైంది. ఈమూవీ విడుదలై 60 రోజులు దాటుతున్న సందర్భంగా బాంబు పేల్చింది ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఆల్రెడీ దేవరి ఓటీటీని ఏలుతోంది. సౌత్ లో ఒక ఓటీటీ, హీందీ ఇంగ్లీష్ తో పాటు పోర్చుగీసు, స్పానీష్ లో మరో ఓటీటీ దేవర పుణ్యమాని పండగ చేసుకున్నాయి. ఇప్పుడు పూర్తి వ్యూస్ తాలూకు రిజల్ట్ వచ్చింది. నెట్ ప్లిక్స్ అయితే ప్రపంచ వ్యాప్తంగా దేవర టాప్ టెన్ లిస్ట్ లో వరుసగా మూడు వారాలనుంచి కంటిన్యూ అవుతోందని తేల్చింది. థియేటర్స్ లో 50 రోజుల్లో 510 కోట్లు రాబట్టిన దేవర, ఓటీటీలో మొదటి వారం. 2.8 మిలియన్లు, మూడు వారాల్లో. 5.8 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. సౌత్ వర్షన్ వ్యూస్ ని కలిపితేమొత్తంగా 10 మిలియన్ వ్యూస్ తో గ్లోబల్ టాప్ టెన్ సినిమాల లిస్ట్ లో చేరింది.
దేవర ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా, కొత్త రికార్డులు క్రియేట్ చేసినా అదేదో కొత్త హీరో మొదటి హిట్ తో తనని తాను ప్రూవ్ చేసుకున్నట్టు, ప్రతీ వారం ఎన్టీఆర్ కి ప్రసవ వేదన తప్పట్లేదు. ఎందుకంటే దేవరి రిలీజ్ కిముందు ట్రోలింగ్ కి గురైంది. రిలీజై వందలకోట్లు కొల్లగొట్టినా ట్రోలింగ్ జరిగింది. ఓటీటీలో మొదటి వారమే సునామీ క్రియేట్ చేసినా ట్రోలింగ్ జరిగింది.. కాని విడుదైలన రెండు నెల్ల తర్వాత కూడా ఓటీటీలో, గ్లోబల్ గా టాప్ టెన్ లో ఉండగలిగిందంటే, ట్రోలింగ్, కామెంట్స్ ని మించేలా ఈ సినిమా ఎదురీదిందని తెలుస్తోంది.
ఆవిషయంలో సక్సెస్ అయ్యిందని ఒప్పుకోవాల్సి వస్తోంది. యాంటీ ఫ్యాన్స్ తోపాటు, సౌత్ హీరోలని చూసి కుల్లుకునే నార్త్ బ్యాచ్ కూడా దేవరని ఎంత ట్రోలింగ్ చేసినా, ఎవరూ దేవర దరువుని ఆపలేకపోయారు. కట్ చేస్తే ఓటీటీలో రిలీజైన మూడు వారాల తర్వాత అసలు రిపోర్టు రికార్డులు క్రియేట్ చేసిందని తేలింది
సౌత్ వర్షన్ మొదటి వారం 2.8 మిలియన్ వ్యూస్ తీసుకొస్తే, హిందీ, ఇంగ్లీష్ తోపాటు పోర్చుగీస్, స్పానిష్ లో దేవర మూవీకి 5.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇలా మూడు వారాల్లో అన్నిభాషల్లో దేవర వ్యూస్ పది మిలియన్లు దాటాయి. అది కూడా వరుసగా 3 వారాలు గా ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ లిస్ట్ లో కంటిన్యూ అయ్యింది దేవర.
ఇది నిజంగా భయంకరమైన రికార్డే… ఎందుకంటే ఓ తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 లో ఉండటమే అరుదైన విషయమంటే, వరుసగా మూడు వారాలు అదే స్థానంలో ఉండటం నిజంగా రికార్డే… గతంలో పవన్ కళ్యాణ్మూవీ బ్రో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో నెం1 ప్లేస్ లో ఓటీటీని ఊపేసింది. కాని వరల్డ్ వైడ్ గా మాత్రం టాప్ టెన్ లిస్ట్ లో చేరలేదు. త్రిబుల్ ఆర్, బాహుబలినే మించిపోయి దేవర గ్లోబల్ ఓటీటీటీ టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో 9వ స్తానంలో మూడు వారాలు కంటిన్యూ అవటం అంటే అద్భుతమే…
ఇలా బాక్సాఫీస్ లో 510 కోట్ల షేర్ వసూళ్లు, ఓటీటీల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ టాప్ 10 లిస్ట్ లో రికార్డులు… ఇవి ఎన్టీఆర్ రెండో పాన్ ఇండియా తో క్రియేట్ చేసిన విచిత్రాలు..ఇండియాలో ఏసినిమాకూడా, ఏహీరో కూడా ఇలా రెండో పాన్ ఇండియా మూవీతోనే ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయటం జరగలేదు.