జపాన్ లో దేవర పూనకాలు… తారక్ వచ్చే ముందే సునామీ…
జపాన్ లో దేవర పూనకాలు మొదలయ్యాయి. ఇక్కడ 670 కోట్లు కొల్లగొట్టిన దేవర, ఇప్పుడు జపాన్ లోరిలీజ్ కాబోతోంది. ఈనెల 28న విడుదలయ్యే సినిమాకోసం, ఈ నెల 22న జపాన్ బయలు దేరబోతున్నాడు ఎన్టీఆర్.

జపాన్ లో దేవర పూనకాలు మొదలయ్యాయి. ఇక్కడ 670 కోట్లు కొల్లగొట్టిన దేవర, ఇప్పుడు జపాన్ లోరిలీజ్ కాబోతోంది. ఈనెల 28న విడుదలయ్యే సినిమాకోసం, ఈ నెల 22న జపాన్ బయలు దేరబోతున్నాడు ఎన్టీఆర్. ఐతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇంకా జపాన్ వెళ్లనే లేదు. వీకెండ్ కి వెళ్లేందుకు ఏర్పాట్లైతే జరుగుతున్నాయి. కాని ఈలోపే జపాన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారు. రిలీజ్ కి ముందే జపాన్ లో దేవర ప్రివ్యూ సునామీ క్రియేట్ చేస్తోంది. అక్కడ థియేటర్స్ లో పడ్డ దేవర ప్రివ్యూ సందడిలో సగం పైన జపనీస్ హల్చలే కనిపిస్తోంది.. ఇంతకి అంతగా వాళ్లేం చేశారు? అందుకే ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు..? హావేలుక్
ఈనెల 28న జపాన్ లో దేవర మూవీ రిలీజ్ కాబోతోంది. టోక్యోతో పాటు ఏకంగా ఎనిమిది సిటీస్ లో దేవర మూవీ 500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. దేవర విడుదలైన ఇన్ని నెలలకి, జపాన్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ వీకెండే జపాన్ లో దేవర ప్రమోషన్ కోసం బయలు దేరబోతున్నాడు తారక్. అంతవరుకు ఓకే, అక్కడికి తను వెళ్లాక హంగామా మొదలైందంటే అర్ధం చేసుకోవచ్చు.కానీ ఈలోపే సోమవారం రోజే దేవర ప్రివ్యూ పడింది. అక్కడి లోకల్స్ థియేటర్స్ లో నానా భీబత్సం చేశారు. నిజానికి ఒకప్పడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలే జపాన్ లోఆడేవి. అలాంటి ట్రెండ్ ని బాహుబలి తో మార్చేశాడు ప్రభాస్. అయితే బాహుబలితో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కవ వసూళ్ల తో పాటు, ఏకంగా ఏడాది పాటు జపాన్ లో త్రిబుల్ ఆర్ దుమ్ముదులిపింది.
అందుకే త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన దేవర జపాన్ లో కూడా దుమ్ముదులిపే ఛాన్సులున్నాయి. ఇక్కడ 670 కోట్లు రాబట్టిన దేవర, ఆల్రెడీ హిట్ మూవీగా రిజల్ట్ తో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు జపాన్ వంతు మిగిలి ఉంది. ఐతే దేవర వచ్చే వారం రిలీజ్ ఉండటం, ఈ వారమే ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ కి వెళ్లటం.. ఇవన్నీ జరగాల్సినవి.. కాకపోతే ఇవేవి జరక్క ముందే దేవర అక్కడ రీసౌండ్ చేస్తోంది.
సోమవారమే ఈ సినిమా ప్రివ్యూ జపాన్ లో పడటమే కాదు, రివ్యూలు, జనాల రెస్పాన్స్ కూడా భారీగానే ఉంది. 12 నగరాల్లో వేసిన ప్రివ్యూకిని దాదాపు 8 వేల మంది చూశారని తెలుస్తోంది. ప్రివ్యూకే ఈ స్థాయిలో రెస్పార్స్ రావటంతో, ఇక ఈ వీకెండ్ రీసౌండ్ వచ్చేలా ప్రమోట్ చేసేందుకు ఫిల్మ్ టీం వేగం పెంచింది. జపాన్ లో జరిగిన విచిత్రం ఏంటంటే దేవర ప్రివ్యూని అక్కడ చూసినవాళ్లలో 65 శాతం జపనీసే ఉండటం షాకింగ్ న్యూస్… నిజంగా అక్కడ ఎన్టీఆర్ కి మార్కెట్ పెరుగుతోంది కాబట్టి, దాన్ని మిస్ చేసుకోవద్దనే, జపాన్ ప్రయాణానికి సిద్దమయ్యాడు తారక్.