Pawan Kalyan: బ్రో కలెక్షన్స్ తగ్గాయి.. అసలు కారణం ఏంటంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా వచ్చిన బ్రో ది అవతార్ సినిమా ఓపెనింగ్ అదరగొట్టింది. జూలై 28న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమాకు ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

Despite the weekends, Bro movie collections are very low
సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ఇదే. సినిమా రిలీజైన నెక్స్ట్ రెండు రోజులు వరుసగా వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్స్ వస్తాయని వీకెండ్ లోపే సినిమా బడ్జెట్ రికవరీ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఎవరూ ఊహించని విధంగా శనివారం సినిమా కలెక్షన్లు బాగా తగ్గాయి. శనివారం బ్రో సినిమాకు ఓవరాల్‌గా 19 కోట్ల 78 లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఓపెనింగ్ డేలో సగం కూడా రాలేదు. వీకెండ్ అయినప్పటికీ ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మొదటి రోజుతో కంపేర్ చేస్తే నిన్న చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా తగ్గాయి. పైగా వీకెండ్ అయినా ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇవాళ కూడా హాలిడే కావడంతో కలెక్షన్స్ నెంబర్ మారే చాన్స్ ఉంది అంటున్నారు. కానీ ఇవాళ కూడా కలెక్షన్స్ తగ్గితే బ్రో సినిమాకు కష్టాలు తప్పేలా కనిపించడంలేదు. రిలీజైన రెండు రోజుల్లో దాదాపు 35 శాతం రికవరీ చేసింది బ్రో సినిమా. ఈ ఆదివారం కంప్లీట్ అయ్యేటప్పటికి 50 శాతం రికవరీ చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రేపటి నుంచి మళ్లీ వీక్‌డేస్ కావడంతో కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉంటాయి. ఎలా చూసినా వచ్చే వారం మాత్రం బ్రో సినిమాకు కీలకంగా మారబోతోంది.