దేవ, వర, దేవర.. రెండు కాదు మూడు రోల్స్, టాలీవుడ్ షేక్

టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియానే కనపడుతోంది. సినిమా విడుదల కాక ముందే ఎన్నో రికార్డులను తొక్కుకుంటూ పోతుంది దేవర. మొదటి ట్రైలర్ తో డీలా పడిన ఫ్యాన్స్ రెండో ట్రైలర్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 24, 2024 | 06:27 PMLast Updated on: Sep 24, 2024 | 6:27 PM

Deva Vara Devara Not Two But Three Roles

టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియానే కనపడుతోంది. సినిమా విడుదల కాక ముందే ఎన్నో రికార్డులను తొక్కుకుంటూ పోతుంది దేవర. మొదటి ట్రైలర్ తో డీలా పడిన ఫ్యాన్స్ రెండో ట్రైలర్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కూడా సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ కావడంతో టాలీవుడ్ పెద్దలు కూడా ఈ సినిమా రిజల్ట్ పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అటు హిందీలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్ లో నిన్న బెనిఫిట్ షోస్ మీద ఓ క్లారిటీ వచ్చింది. మొత్తం హైదరాబాద్ తో పాటుగా తెలంగాణాలో 29 చోట్ల బెనిఫిట్ షోస్ ఉంటాయి. తెల్లవారుజామున ఒంటి గంటకు షోస్ మొదలవుతాయి. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటి వరకు రెండు పాత్రల్లో కనపడతాడు అని అందరూ భావించారు. కాని ఇప్పుడు రెండు కాదు మూడు అనే టాక్ వస్తోంది. దేవ ఒక పాత్ర, వర ఒక పాత్ర, దేవర మరోపాత్ర. దేవ, వర… దేవర కొడుకులు అని సమాచారం.

ఆ లుక్ ఇంకా విడుదల కాలేదు కేవలం సినిమాలో మాత్రమే చూపిస్తారు అని టాక్. సినిమాలో ఆ పాత్రే హైలెట్ అవుతుందని టాక్. ఆ పాత్రలో ఎన్టీఆర్ పూర్తిగా గడ్డంతో కనపడతాడు అంటున్నారు సినీ జనాలు. ఇప్పుడు మూడు పాత్రలు అనే వార్త టాలీవుడ్ ని సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ గతంలో కూడా మూడు పాత్రల్లో నటించాడు. అప్పుడు నటించడం ఇప్పుడు నటించడం ఒకటి కాదు. ఇక ఈ సినిమాలో ఎవరూ చూడని మరో యాక్టర్ కూడా ఉంటారని టాక్. ఏది ఎలా ఉన్నా ఈ సినిమాపై మాత్రం ఉన్న అంచనాలు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి.