పది రోజులు 470 కోట్లు, శుక్రవారం వరకు దేవరకు డెడ్ లైన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఎవడేన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా దేవర జాతర మాత్రం ఆగలేదు. పక్కా లెక్కలతో సరైన టార్గెట్ ఫిక్స్ చేసుకుని దిగిన దేవర సినిమా స్పీడ్ ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. సినిమా వసూళ్లు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఎవడేన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా దేవర జాతర మాత్రం ఆగలేదు. పక్కా లెక్కలతో సరైన టార్గెట్ ఫిక్స్ చేసుకుని దిగిన దేవర సినిమా స్పీడ్ ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు. సినిమా వసూళ్లు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. సినిమా ఇప్పటికే ఇండియా తో పాటుగా ఓవర్సీస్ లో కూడా భారీగా రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు దేవర దెబ్బకు టాలీవుడ్ లో వేరే స్టార్ హీరోల రికార్డులు కూడా మిగలడం లేదు. ముఖ్యంగా ప్రభాస్ రికార్డులను దేవర గురిపెట్టి కొట్టడం షాక్ ఇచ్చే అంశం.
ఇక గత పది రోజుల నుంచి వేరే సినిమాలు ఏవీ దేవరకు పోటీ ఇచ్చేవి లేకపోవడంతో దేవర సునామీ ఆగడం లేదు. ఇక దసరా వరకు దేవరకు ఇబ్బంది అయితే కనపడటం లేదు. దీనితో సినిమా వసూళ్లు మరో 300 కోట్ల వరకు పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అదే జరిగితే టాలీవుడ్ లో ఎన్టీఆర్ వసూళ్ళ విషయంలో నెంబర్ 2. కల్కీ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. దేవర సినిమా అక్కడి వరకు వెళ్లకపోయినా నెంబర్ 2 స్థానంలో ఆగిన మాట వాస్తవం. దేవర పార్ట్ 2 పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాలో చాలా వరకు షూట్ కూడా పూర్తి అయింది. ఒక నాలుగు నుంచి 5 నెలల పాటు షూట్ చేస్తే ఆ షూట్ కూడా పూర్తి కావచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అయితే కొరటాల శివ మాత్రం ఈ సినిమా షూట్ ను వచ్చే ఏడాది చివర్లో మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో దేవర 2 షూట్ లో పాల్గోనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక దేవర మొదటి పార్ట్ వసూళ్ళ విషయానికి వస్తే… 466 కోట్లు ఇప్పటి వరకు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
పది రోజుల్లో ఈ సినిమా ఇప్పటి వరకు ఆ రేంజ్ లో వసూలు చేస్తే ఇంకా శుక్రవారం వరకు దేవరకు టైం కనపడుతోంది. శుక్రవారం వేరే సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు విడుదల అయ్యే సమయానికి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ నాలుగు రోజుల్లోనే దేవర వసూళ్లను పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ సినిమాలకు మంచి టాక్ వస్తే ఈ సినిమా వసూళ్ళపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అందుకే ఇటు చిత్ర యూనిట్ తో పాటు అటు ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు.