దేవర 2 ల్యాండింగ్… డ్రాగన్ నుంచి గ్రీన్ సిగ్నల్..

దేవర ఎన్టీఆర్ ఫేట్ ని మార్చి, రాజమౌళి సాయం లేకుండా తనేంటో ప్రూవ్ చేసుకునేలా చేసిన మూవీ. అలాంటి సినీమాకి సీక్వెల్ ని ఎప్పుడో ప్రకటించినా, వార్2, డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యే వరకు దేవర 2 కి నో ఛాన్స్ అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2025 | 07:30 PMLast Updated on: Mar 07, 2025 | 7:30 PM

Devara 2 Landing Green Signal From Dragon

దేవర ఎన్టీఆర్ ఫేట్ ని మార్చి, రాజమౌళి సాయం లేకుండా తనేంటో ప్రూవ్ చేసుకునేలా చేసిన మూవీ. అలాంటి సినీమాకి సీక్వెల్ ని ఎప్పుడో ప్రకటించినా, వార్2, డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యే వరకు దేవర 2 కి నో ఛాన్స్ అన్నారు. కట్ చేస్తే దేవర సీక్వెల్ ప్రకటన రాబోతోంది. దేవర2 ప్రాజెక్టులో కదలిక మొదలైంది. కొరటాల శివ ఫైనల్ స్క్రీప్ట్ నెరేషన్ ని మంగళవారం ముంబై వెళ్లీ మరీ ఇచ్చేశాడు. నెరేషన్ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెరిగింది. సో ఇక మిగిలింగి దేవర2 సెట్స్ పైకెళ్లటమే. కాకపోతే ఎన్టీఆర్ ఇంతవరకు డ్రాగన్ సెట్లో అడుగుపెట్టలేదు. ఈ వారం అంతావార్ 2 సాంగ్ షూటింగ్ తోనేబిజీ కాబోతున్నాడు. మంత్ ఎండ్ నుంచి డ్రాగన్ సెట్లో తను అడుగు పెట్టడం కన్ఫామ్ అయ్యింది. ఇలాంటి టైంలో దేవర 2 ఎనౌన్స్ మెంట్ అంటే అర్ధమేంటి? డ్రాగన్ తో పాటు దేవర 2 ప్యార్ లల్ గా తెరకెక్కుతుందా? ప్రశాంత్ నీల్ నుంచి దేవర 2 టీం ఏం ఎక్స్ పెక్ట్ చేస్తోందో అది వచ్చేసిందా? ఇంతకి కొరటాల శివ కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ప్రామిస్ ఏంటి? టేకేలుక్.

వార్ 2 మూవీలో మిగిలింది పాట షూటింగ్ మాత్రమే. ఆది ఆల్రెడీ మొదలైంది. సెట్లో 500 మంది డాన్సర్స్ తో కలిసి ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ తీన్మార్ వేస్తున్నారు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ సాంగ్ ని ఆదివారం లోగా షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఆతర్వాత రెండు వారాల రెస్ట్ తీసుకుని డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు. ఐతే ఈలోపే దేవర 2 ఎనౌన్స్ మెంట్ కి ముహుర్తం కుదిరినట్టుంది. ఉగాదికి దేవర 2 పోస్టర్ తో పాటు షూటింగ్ ని కూడా లాంచనంగా మొదలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉగాదికి సినిమాను లాంచ్ చేసి, రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం మే ఎండ్ నుంచి మొదలు పెట్టే ఛాన్స్ఉందట. ఆల్రెడీ కథ సిద్దమైంది. ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేర్పులు కూడా చేసి, మంగళవారమే ముంబైకెళ్లీ మరీ ఫైనల్ స్క్రీప్ట్ వినిపించాడట కొరటాల శివ.

తననుంచి ఫుల్ క్లియరెన్స్ రావటంటో, ఇక లొకేషన్లు, మ్యూజిక్ సిట్టింగ్స్ ఇలా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మొదలుపెడుతున్నాడు కొరటాల శివ. ఐతే డ్రాగన్ మూవీ ఎప్పుడో మొదలైనా, తారక్ మాత్రం ఇంతవరకు సెట్లో అడుగుపెట్టలేదు. వార్ 2 షూటింగ్ డిలే అవటం వల్లే జనవరిలో మొదలవ్వాల్సిన డ్రాగన్ షూటింగ్ వాయిదా పడుతూ మొన్నీమధ్యే మొదలైంది. ఎన్టీఆర్ లేనీ సీన్లు తీస్తూ ప్రశాంత్ నీల్ బిజీ అయ్యాడు. సో వార్ 2 పాట షూటింగ్ పూర్తి చేస్తి, మంథ్ ఎండ్ కల్లా డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడు. అలా చూసినా డ్రాగన్ షూటింగ్ కే ఏడాది టైం పడుతుంది. అలాంటప్పుడు డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టేలోపే దేవర2 ని కొరటాల శివ మొదలుపెడితే ఎలా అన్న డౌట్ ఎదురౌతుంది.

కాని ఇక్కడ ప్రశాంత్ నీల్ కూడా కొరటాల శివ దేవర2 ప్లానింగ్ కి సైడ్ ఇచ్చాడని తెలుస్తోంది. నిజానికి డ్రాగన్ టాకీ పార్ట్ కేవలం 5 నెలల్లో పూర్తి చేస్తానన్నాడట ప్రశాంత్ నీల్. సో తారక్ ఈ మంథ్ ఎండ్ డ్రాగన్ సెట్లో అడుగుపెట్టినా, ఆగస్ట్ ఎండ్ లోగా లేదంటే సెప్టెంబర్ రెండో వారం లోగా డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ పూర్తవుతుందట. అంగుకే మే ఎండ్ లేదంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి దేవర 2 రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు కొరటాల శివ. ఆలోగా డ్రాగన్ 60శాతం పైనే షూటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఒక సినిమా మరో మూవీషూటింగ్ కి ఎలాంటి అడ్డు కాదు. సో దేవర 2 ఇప్పడప్పట్లో పట్టాలెక్కదనే మాటలు వినిపిస్తున్న వేళ, దేవర2 ప్రాజెక్టు పనుల్లో సడన్ గా స్పీడ్ మొదలైనట్టు కనిపిస్తోంది.