8 రోజులు 600 కోట్లు.. 6 రోజుల్లో థౌజెండ్ వాలా సెలబ్రేషన్స్ …

దేవర వసూళ్లకి అడ్డు లేదు అదుపులేదు. పోటీ ఇచ్చే మూవీ రావట్లేదు. యూఎస్ లో 5 రోజుల్లో 4 మిలియన్లు, 7 రోజుల్లో 6 మిలియన్లు... ఒక్కరోజులోనే 1 మిలియన్, దీనికి తోడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పెరుగుతున్న వసూళ్లు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 6, 2024 | 12:02 PMLast Updated on: Oct 06, 2024 | 12:02 PM

Devara 600 Crores For 8 Days

దేవర వసూళ్లకి అడ్డు లేదు అదుపులేదు. పోటీ ఇచ్చే మూవీ రావట్లేదు. యూఎస్ లో 5 రోజుల్లో 4 మిలియన్లు, 7 రోజుల్లో 6 మిలియన్లు… ఒక్కరోజులోనే 1 మిలియన్, దీనికి తోడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పెరుగుతున్న వసూళ్లు…మొత్తంగా 12 మిలియన్ డాలర్లంటే, ఆల్ మోస్ట్ 96 కోట్ల వరకు యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ నుంచే వచ్చాయి. బ్రిటన్ వసూళ్లూ ఇండియన్ కరెన్సీలో కలిపితేనే ఈ లెక్క తేలింది. విచిత్రం ఏంటంటే, తెలుగు,తమిళ్, మిందీ, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో ఎన్నారైల నుంచి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇండియా వరకొచ్చే సరికి, తెలుగు, హిందీ వర్షన్స్ సినీ సునామీ క్రియేట్ చేశాయి. తమిల్, కన్నడలో నిదానంగా వసూళ్లు పెరిగాయి… అంతా బానే ఉంది. రోజు రోజుకి లెక్కల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. అలా చూస్తే దసరా కాదు, అందుకు ఒకరోజు ముందు సద్దులు బతుకమ్మ రోజే 1000 కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టేలా ఉన్నాడు. విడుదలయ్యాక వెయ్యికోట్లే పెద్ద లక్ష్యం.. కాని కలెక్షన్స్ చూస్తుంటే, 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వైపు ఈ సినిమా లక్ష్యం మారేలా ఉంది…

దేవర వసూల్ల వరద కాస్త సునామీగా మారి 1000 కోట్ల వసూళ్ల వైపు పరుగులు పెట్టింది. 6 రోజుల్లో 400 కోట్లు, 7రోజుల్లో 480కోట్లు, ఎనిమిది రోజుల్లో 600 కోట్లు… అంటే మరో నాలుగైదు రోజుల్లో వెయ్యికోట్ల పండగొచ్చినట్టే… ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ , కొరటాల శివ అండ్ కో కలిసి చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాంబ్ పేలింది. దేవర సీక్వెల్ త్వరలో పట్టాలెక్కబోతోందన్న వార్త, దేవర వసూళ్ల లో మరింత పూనకాలు తెచ్చేలా ఉంది

యూఎస్ లో కేవలం 8 రాష్ట్రాల్లోనే 5. 6 మిలియన్ డాలర్లు రాబట్టిన దేవర, యకే కరెన్సీ పౌండ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డాలర్స్ లెక్కలతో కలిపితే ఈ సినిమా ఇప్పిటి వరకు ప్రివ్యూతోకలిపి 96 కోట్లు రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే, ఈ వసూళ్ల లెక్క 300 కోట్లు దాటింది… అంటే నార్త్ ఇండియాలో200 కోట్లు వచ్చిందని తెలుస్తోంది

తెలుగు రాష్ట్రాల్లో దేవరకి 8 రోజుల్లో 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావటం అంటేనే రికార్డు.. అలాంటిది అదే వన్ వీక్ లో ఓ తెలుగు సినిమా హిందీ మార్కెట్ లో 200 కోట్లు రాబట్టడంతో హిస్టరీ క్రియేట్ అయ్యింది. ఓవర్ సీస్ లో ఈ సండే వసూళ్ల తో కలిపి 100 కోట్ల వసూళ్లు వచ్చినట్టతుంది…

తమిళనాడు, కర్ణాటక, కేరళాలో విచిత్రంగా దేవరకి 4 కోట్ల నెట్ వసూళ్లే వచ్చాయి. మొదటి రోజు మరీ తక్కువగా ఒక్కో ఏరియాలో, 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలే వచ్చాయి. సరే తెలుగు సినిమా అంటే తమిళ, మలయాళ మార్కెట్ లోచిన్న చూపు కొత్త కాదు. కొంతవరకు అసూయ అని కూడా అంటారు. కాకపోతే దేవర మీద నెగెటీవ్ టాకే అక్కడ వసూళ్ల కి బ్రేక్ వేసిందంటారు.

కాకపోతే ఇప్పడిప్పుడే తమిళ,మలయాళ మార్కెట్ లో దేవర దూసుకెళుతున్నాడు. కర్ణాటకలో కూడా దేవర వసూళ్లలో ఊపు రోజు రోజుకి పెరుగుతోంది. తెలుగు, హిందీ మార్కెట్ల రేంజ్ లో పూనకాలు రావాలంటే వారం టైం పట్టేలా ఉంది… ఎలా చూసినా కేవలం నార్త్ ఇండియా, తెలుగు రాష్ట్రాలు, అలానే ఓవర్ సీస్ బిజినెస్ తోనే 8 రోజుల్లో 600 కోట్లొచ్చాయంటే, మిగతా సౌత్ స్టేట్స్ లో కూడా ఇలానే దూసుకెళితే ఈ పాటికే వెయ్యికోట్ల క్లబ్ లో అడుగు పెట్టేవాడు దేవర

ఏదేమైనా, ప్రజెంట్ వెయ్యికోట్ల వసూల్ల మరో నాలుగైదు రోజుల్లో సాధ్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఆతర్వాత ఏంటనే ప్రశ్నకే 1500 కోట్ల వసూళ్లే లక్ష్యంగా కనిపిస్తున్నాయి. కల్కీ 1000 కోట్లు దాటగానే, ఇది 1500 కోట్ల క్లబ్ లో అడుగుపెడుతుందన్నారు. కాని మధ్యలో పోటీకి హాలీవుడ్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు సీన్ చూస్తే రజినీ వెట్టయాన్ వెనకడుగు వేసి, దీపావలికొచ్చినా, దేవర దరువుకి నష్టం లేదంటున్నారు. అదే జరిగితే, 1500 కోట్ల టార్గెట్ ఇంపాజిబులేం కాదనే మాటే వినిపిస్తోంది.