“దేవర 8.2 కోట్లు”, నైజాంలో ప్రభాస్ రికార్డులకు నైట్ మేర్

టాలీవుడ్ లో ఇప్పుడు రికార్డుల యుద్ధం సైలెంట్ గా సాగుతోంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్ తీరంలో రికార్డుల అలలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి జనాలకు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 30, 2024 | 07:15 PMLast Updated on: Sep 30, 2024 | 7:15 PM

Devara 8 2 Crore Night Mare For Prabhas Records In Naijam

టాలీవుడ్ లో ఇప్పుడు రికార్డుల యుద్ధం సైలెంట్ గా సాగుతోంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్ తీరంలో రికార్డుల అలలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి జనాలకు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టె ఫ్యాన్స్ కు ఇప్పుడు కంటి మీద కునుకు ఉండటం లేదు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాలో ప్రభాస్ రికార్డులను టార్గెట్ చేసే దమ్ము ఏ హీరోకి లేదు అనుకుంటున్న సమయంలో దేవర సృష్టిస్తున్న సునామీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ప్రభాస్ నాలుగు సినిమాల రికార్డులను ఇప్పుడు దేవర తొక్కుకుంటూపోయింది. అవును లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సినిమాపై ఏ రేంజ్ లో నెగటివ్ ప్రచారం చేసినా సరే వసూళ్లు మాత్రం ఎక్కడా ఆగలేదు. ఒక్కో రికార్డును సైలెంట్ గా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసింది దేవర. మెగా ఫ్యామిలీతో పాటుగా ప్రభాస్ రికార్డులను కూడా ఎర్ర సముద్రంలో కలిపేసింది. ఫ్యాన్స్ కి కూడా నచ్చని సినిమా ఇప్పుడు సిని ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసి రికార్డులను నమోదు చేస్తోంది. నైజాం లో ఇప్పుడు ప్రభాస్ రికార్డులను కనుమరుగు చేసింది దేవర.

నైజాంలో దేవరకు రెండవ రోజు వచ్చిన షేర్… 8.2 కోట్లు. రాధేశ్యాంకి వచ్చిన వసూళ్లు 3.38 కోట్లు. భారీ అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ కి వచ్చిన షేర్ 5.13 కోట్లు. ఇక సలార్ కు వచ్చిన షేర్ 6.10 కోట్లు. సూపర్ హిట్ సినిమా కల్కీ కి వచ్చిన షేర్… 7.4 కోట్లు. అంటే దాదాపు కోటిపైనే తేడా ఉంది. మళ్ళీ దేవర మణుగూరు షేర్ ని కలపలేదు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు నైజాం లో దేవర మేనియా ఏ రేంజ్ లో ఉందో. ప్రభాస్ కు ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ కి సంబంధం లేదు. కాని దేవర మాత్రం ప్రభాస్ సినిమాలనే టార్గెట్ చేసి కొట్టడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.