బాహుబలిని దేవర దాటేసాడు, జాతరకు కొత్త ఊపొచ్చింది..
టాలీవుడ్ లో ఇప్పుడు దేవర కొడుతున్న దెబ్బ మాములూగా లేదు. సినిమా దెబ్బకు కూసాలు కదులుతున్నాయి జనాలకు. ఇప్పటి వరకు తమ రికార్డ్ లు సేఫ్ అనుకున్న వాళ్లకు దేవర కొడుతున్న దెబ్బ పది కాలాల పాటు గుర్తుంటుంది.
టాలీవుడ్ లో ఇప్పుడు దేవర కొడుతున్న దెబ్బ మాములూగా లేదు. సినిమా దెబ్బకు కూసాలు కదులుతున్నాయి జనాలకు. ఇప్పటి వరకు తమ రికార్డ్ లు సేఫ్ అనుకున్న వాళ్లకు దేవర కొడుతున్న దెబ్బ పది కాలాల పాటు గుర్తుంటుంది. కరువు మీదున్న దేవర… ఇప్పుడు అటు బాలీవుడ్ పై కూడా విరుచుకుపడుతున్నాడు. పండగ సీజన్ లో ఎర్ర సముద్రానికి ఎదురెళ్ళే దమ్మున్న హీరో లేకపోవడంతో దేవర సత్తా ఏంటో క్లియర్ గా అర్ధమవుతోంది. బాలీవుడ్ సినిమా విడుదలైనా కూడా దేవర ముందు ఆటలు సాగడం లేదు.
వసూళ్ళ విషయంలో నా టార్గెట్ వెయ్యి కోట్లు అంటూ దేవర దూసుకుపోతున్నాడు. నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన వాళ్లకు రికార్డులతో సమాధానం చెప్పాడు దేవర. ఇప్పుడు సినిమా స్పీడ్ చూస్తే ఇంకో పది రోజుల పాటు ఇదే ఊపు కొనసాగే అవకాశం కనపడుతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు బాలీవుడ్ మార్కెట్ తో పాటుగా కన్నడ మార్కెట్ కూడా ఊహకు అందని రేంజ్ లో పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డీలా పడ్డారు అప్పట్లో. కాని ఇప్పుడు దేవర ఇచ్చిన బూస్ట్ తో ఏ రికార్డులు అయినా తోక్కేస్తాం అని ధీమాగా ఉన్నారు.
ఇక దేవర ఇప్పుడు తనకు ఎదురు లేదు అని ప్రూవ్ చేస్తోంది. తాజాగా ఓ కొత్త రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ రికార్డుల మీద గురి పెట్టి కొడుతున్న దేవర ఇప్పుడు మరో ప్రభాస్ రికార్డ్ ని కూడా సముద్రంలో కలిపెసాడు. దేవర సునామీ దెబ్బకు బాహుబలి సినిమా రికార్డుల కూసాలు కూడా కదిలాయి. విడుదలై రెండు వారాలు 2 రోజులు ఎక్కువే అయింది. అంటే 16 రోజుల్లో దేవర ఎక్కడా వెనక్కు తగ్గలేదు. 16 వ రోజు వసూళ్లు చూస్తే… దేవర మేనియా క్లియర్ గా అర్ధమైపోతుంది అనడంలో సందేహం లేదు.
16వ రోజు దేవర 3.65 కోట్లు సాధించింది. అంతకు ముందు బాహుబలి 2 సినిమా 16 వ రోజు అగ్ర స్థానంలో ఉండేది. 3.5 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. ఇప్పుడు దేవర దాటేసింది. తొలి రెండు స్థానాల్లో ఈ రెండు సినిమాలు ఉండగా మూడవ స్థానంలో హనుమాన్ సినిమా నిలిచింది. 3.21 కోట్లు సాధించింది ఆ సినిమా. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా 3.10 కోట్లు సాధించింది. ఇక ఎఫ్ 2 సినిమా 2.56 కోట్లు సాధించింది. ఇప్పటికే దేవర వసూళ్లు దేశ వ్యాప్తంగా 500 కోట్లు దాటాయి. ఇదే ఊపు దీపావళి వరకు కొనసాగితే తొక్కుకుంటూ పోవడమే.