యూఎస్ లో 15 ని’ యూకేలో 5 ని’లే దేవర జాతర,
దేవర సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో విదేశాల్లో వస్తున్న క్రేజ్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. సినిమా ఇంకా విడుదలకు వారం రోజులు ఉండగానే వసూళ్ళతో తన సత్తా చాటుతోంది దేవర సినిమా.
దేవర సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో విదేశాల్లో వస్తున్న క్రేజ్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. సినిమా ఇంకా విడుదలకు వారం రోజులు ఉండగానే వసూళ్ళతో తన సత్తా చాటుతోంది దేవర సినిమా. సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో బయటకు వస్తున్న కొన్ని వార్తలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జనాలలో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటి వరకు 1800 థియేటర్స్ లో ప్రీ బుకింగ్ హౌస్ ఫుల్ అయ్యాయి.
ఇక ఆస్ట్రేలియాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. అక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. 3 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు వసూలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక యూకే లో అయితే టికెట్ లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. ప్రీమియర్స్ కి అయితే ఏకంగా గంటలో 841 టికెట్ లు అమ్ముడు అయ్యాయి. 52 చోట్ల సినిమాను ప్రదర్శిస్తుండగా… మొత్తం 71 షోస్ కి టికెట్ లు కొన్నారు ఫ్యాన్స్. దీని బట్టి చూస్తే యూకేలో ఫ్యాన్స్ సినిమా మొదటి రోజు చూడటానికి ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఒక థియేటర్ లో అయితే సినిమాకు ప్రీమియర్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. అసలు అప్పటి వరకు ప్రీ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. కాని అలా ఓపెన్ అయిన 5 నిమిషాల్లో ఓ థియేటర్ లో హౌస్ ఫుల్ అయిపోయాయి. లీసేస్టర్ లోని ఓ థియేటర్ లో 5 నిమిషాలకే థియేటర్ ఫుల్ అయిపోవడం చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. సినిమా ఎలా ఉంటుందో తెలియక ముందే జనాల్లో ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే… సినిమా విడుదలై హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని సినీ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.