అక్కడ దేవర ముందు తగ్గాడు… తగ్గాల్సి వచ్చింది…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర టోటల్ కలెక్షన్స్ ని 10 రోజుల్లో బన్నీ దాటేస్తాడన్నారు... అమెరికాలో బాహుబలికి బాప్ పుష్పరాజ్ అన్నారు. కట్ చేస్తే 50 మిలియన్లు దేవుడెరుగు, దేవర లో సగం సందడి కూడా పుష్పరాజ్ కి కష్టమౌతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 22, 2024 | 03:15 PMLast Updated on: Nov 22, 2024 | 3:15 PM

Devara Domination On Pushpa

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర టోటల్ కలెక్షన్స్ ని 10 రోజుల్లో బన్నీ దాటేస్తాడన్నారు… అమెరికాలో బాహుబలికి బాప్ పుష్పరాజ్ అన్నారు. కట్ చేస్తే 50 మిలియన్లు దేవుడెరుగు, దేవర లో సగం సందడి కూడా పుష్పరాజ్ కి కష్టమౌతోంది. ఇంకా రిలీజ్ కాకముందే ఇంత క్లారిటీ రావటం కూడా విచిత్రమే… ప్రిరిలీజ్ బిజినెస్ లానే ఇది ప్రీరిలీజ్ క్లారిటీ అనుకోవాల్సి వస్తోంది.. ఎక్కడైనా తగ్గనన్నా పుష్పరాజ్ ఇప్పుడు యూఎస్ లో తగ్గాల్సి వస్తోంది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అన్నాడు. నిజంగానే ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాంలో దేవరని దాటడం కాదు, దేవర రేంజ్ ని రీచ్ అయితే చాలనే పరిస్థితి వచ్చింది. ఎందుకు? అంతగా యూఎస్ లో పుష్ప2 కి దేవర పెద్ద శిఖరంలా ఎందుకు కనిపిస్తోంది?

దేవర రిలీజ్ కిముందు ఎంత ట్రోలింగ్ గురైందో, అంతకుమించే హైప్ క్రియేట్ అయ్యింది. విడుదలయ్యాక వసూళ్ల వండర్స్ ని క్రియేట్చేసింది. ఓటీటీలో రెండు వారాల్లో 6 మిలియన్ వ్యూస్ తో దుమ్ముదులిపేసింది. అలాంటి దేవరని యూఎస్ లో మించి అది కూడా 5 రెట్ల వసూళ్లు రాబడతాడు పుష్పరాజ్ అన్నారు.

ఇది మరీ అతివిశ్వాసమే అయినా, రిలీజ్ అయ్యాకే అసలు సంగతి తెలుస్తుందన్నారు.కాని రిలీజ్ కి ముందే దేవర ముందు పుష్పరాజ్ చేతులెత్తేశాడు. యూఎస్ లో ఇది క్లియర్ కట్ గా తేలిపోయింది

దేవర మూవీ యూఎస్ లో ప్రివ్యూ రూపంలో రికార్డులు క్రియేట్ చేసింది. ఆరికార్డుని బ్రేక్ చేయటం కాదు రీచ్ అవటం కూడా పుష్పరాజ్ కి కష్టాంగా మారుతోంది. దేవర మూవీ ప్రివ్యూని యూఎస్ లో 408 లొకేషన్స్ లో 1197 షోలేశారు. 35,000 టిక్కెట్లు సేల్చేశారు. అలా నార్త్ అమెరికాలో ఈ సినిమా 1.12 మిలియన్లు అంటే, 11 లక్షల 20 వేల డాలర్లు కేవలం ప్రివ్యూకే రాబట్టింది

ఇది ఇండియన్ కరెన్షీలో 9 కోట్లతో సమానం. అంటే ఉత్తర అమెరికాలో రిలీజ్ కిముందు ఒకే ఒక్క షోకి 9 కోట్లు రాబట్టడం అంటే రికార్డే… కాని ఈ రికార్డుని బ్రేక్ చేయటం కాదు, అందులో సగం కూడా పుష్పరాజ్ కి కుదిరేలా లేదు. ఎక్కడ ఎలా ఉన్నా నార్త్ అమెరికాలో దేవరని పుష్ప2 టచ్ చేసేలా లేదు

ఎందుకంటే, ఉత్తర అమెరికాలో, 871 లొకేషన్స్ లో 3301 షోలు ప్రివ్యూ రూపంలో పుష్పరాజ్ సందడి చేయబోతున్నాడు. అంటే దేవరతో పోలిస్తే డబుల్ షోలు వేస్తున్నారు. అలా అయితే డబుల్ ఎమౌంట్ రావాలి. కాని 36, 885 వేల టిక్కెట్లు సేల్ అయినా, ఓవరాల్ గా పుష్ఫ 2 ప్రివ్యూ కలెక్షన్స్ దేవరని రీచ్ కావట్లేదు. దేవరకంటె ఎక్కవు లొకేషన్స్ లో ఎక్కువ షోలు వేసి, ఎక్కువ టిక్కెట్లు సేల్ చేసినా, పుష్ప 2 మూవీ ప్రివ్యూ షోకి, 1 మిలియన్ వసూళ్లే రాబట్టింది. ఈ అడ్వాన్స్ మొత్తం చూస్తే 8 కోట్లలోపే ఉంది.. ఇదే ఇప్పుడు యూష్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది.