దేవర సునామీ అక్కడ కూడా…. తంబీలు గిలగిల కొట్టుకుంటున్నారా..?
దేవర సునామీ రెండో సారి మొదలైంది. థియేటర్స్ లో వందలకోట్లు రాబట్టి, కామెంట్లకు, ట్రోలింగ్స్ కి గట్టి షాకే ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు ఓటీటీలో సునామీ క్రియేట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు తమిళ మూవీ సత్యం సుందరం ఓటీటీని షేక్ చేస్తూ వచ్చింది..
దేవర సునామీ రెండో సారి మొదలైంది. థియేటర్స్ లో వందలకోట్లు రాబట్టి, కామెంట్లకు, ట్రోలింగ్స్ కి గట్టి షాకే ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు ఓటీటీలో సునామీ క్రియేట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు తమిళ మూవీ సత్యం సుందరం ఓటీటీని షేక్ చేస్తూ వచ్చింది..దీని దెబ్బకు గోట్, భారతీయుడు 2 ఓటీటీ రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయనుకునేలోపు, సీన్ లోకి దేవర వచ్చాడు. దెబ్బకి సత్యం సుందరం జోరు సైడ్ కి వెళ్లేలా ఉంది. గురువారం అర్ధరాత్రి దేవర మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అంతే దెబ్బకి లెక్కలుమారిపోయాయి. నిన్నటి వరకు ఓటీటీలో సత్యం సుందరం మూవీదే హవా… కాని ఇప్పుడు సత్యం సుందరాన్ని పక్కన పెట్టేలా,దేవర వ్యూవర్ షిప్ టైటానిక్ షిప్ కంటే పెద్దదైపోయింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా వచ్చేశాడు. ఓటీటీ మీద దండెత్తాడు.. అంతే దెబ్బకి సౌత్ సినిమాల్లో సైలెన్స్ కనిపిస్తోంది. నిన్ని మొన్నటి వరకు తమిళ సినిమా సత్యం సినిమాదే ఓటీటీ వ్యూవర్ షిప్ లో డామినేషన్ కనిపించింది. కాని దేవర ఓటీటీలోకి అడుగుపెట్టగానే సీన్ మారిపోయింది
ఓటీటీలో దేవర స్టామినా తెలియాలంటే, ఆల్రెడీ దూసుకెళుతున్న సత్యం సుందరం వ్యూవర్ షిప్ స్టామినా అర్దం చేసుకోవాలి. నిజానికి కార్తి, అరవింద స్వామి కలిసి చేసిన సత్యం సుందరం థియేటర్స్ లో పెద్దగా వండర్స్ చేయలేదు. కాని ఓటీటీలో సునామీ తీసుకొచ్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి రాగానే, మొదటి వారొ. 1.9 మిలియన్ వ్యూవర్ షిప్ వస్తే, సెకండ్ వీక్ 2.8 మిలియన్స్ అంటే రెండు వారాల్లో 4.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఈ వీకెండ్ కల్లా, తమిళ సినిమాలైన గోట్, భారతీయుడు 2 తాలూకు ఓటీటీ వ్యూస్ ని సత్యం సుందరం మూవీ దాటేస్తుందన్నారు. దేవర రాకముందు, కూడా దేవరని కూడా ఓటీటీలో మించిపోతుంది సత్యం సుందరం మూవీ అన్నారు. కాని లెక్కలు తారుమారయ్యేలా ఉన్నాయి
దేవరకి తెలుగు, కన్నడ ఆడియన్స్ ని కలిపినా ఆలెక్క నార్త్ ఇండియాలోని తారక్ ఫ్యాన్ బేస్ కి సమానం కాదు… బేసిగ్గా ఉత్తారాదిన పాపులేషన్ ఎక్కువ. త్రిబుల్ ఆర్, దేవర హిట్లతో ఎన్టీఆర్ కి అక్కడ మాస్ ఫ్యాన్ బేస్ మరీ ఎక్కువ… ఆల్రెడీ నార్త్ ఇండియా వసూళ్లే ఆవిషయం క్లియర్ గా తెలిసేలా చేశాయి.
ఇప్పుడు ఓటీటీ లో కూడా దేవర సునామీ మామూలుగా లేదు. గురువారం అర్ధరాత్రి ఓటీటీలో
మొదలైన దేవర దరువు, ఇక మీదట వ్యూస్ తో ఇక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేసేలాఉంది. ఎందుకంటే దేవర స్ట్రీమింగ్ లోకి రాగానే, ఒక్కసారిగా సత్యం సుందరం ట్రెండింగ్ లిస్ట్ లోంచి కిందకొచ్చేసింది. ఇక ఎంతగా వ్యూస్ వచ్చాయనేది మరో 12 గంటల్లో బయటపడబోతోంది. ప్రస్థుతానికి ట్రెండింగ్ లిస్ట్ ప్రకారం చూస్తే దేవరనే టాప్ పొజిషన్ లో ఉన్నాడు.