Devara: దేవర క్లైమాక్స్‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే.. జూనియ‌ర్ కోసం భారీ సెట్…?

ఇప్ప‌టికే విడుద‌లైన యంగ్ టైగ‌ర్ లుక్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డ‌గా.. గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన క్లైమ్సాక్స్ కోసం వ‌చ్చిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు ఇప్ప‌టి నుంచే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2024 | 02:59 PMLast Updated on: Jan 24, 2024 | 2:59 PM

Devara Movie Climax Shoot Jr Ntr Doing Heavt Action Sequence

Devara: ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రెస్టేజియ‌స్‌గా తీస్తున్న మూవీ దేవ‌ర. ఆచార్య ప్లాప్‌తో క‌సి మీద ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.. ఈ మవీ కోసం ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీ రెడీ చేశాడు. జెడ్ స్పీడ్‌తో షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ ప్యాన్ ఇండియా మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన యంగ్ టైగ‌ర్ లుక్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డ‌గా.. గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Chiranjeevi: మెగా సస్పెన్స్‌.. “హనుమాన్-2”లో భజరంగ్‌గా మెగాస్టారేనా..?

ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ రోజురోజుకూ మూవీపై హైప్‌ని ఓ రేంజ్‌లో పెంచేస్తుండ‌గా.. దైవ‌ర క్లైమ్సాక్స్ కోసం వ‌చ్చిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు ఇప్ప‌టి నుంచే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ మొద‌టి పార్ట్‌ను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్‌కి సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పుడు క్లైమాక్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోటి రూపాయల భారీ స్విమ్మింగ్ ఫూల్ సెట్‌లో దేవర క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఎన్టీఆర్ అభిమానులకు ఈ యాక్షన్ సీక్వెన్స్ కనుల విందుగా ఉంటుందని టాక్. అంతేకాదు.. ఈ భారీ బడ్జెట్ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘దేవర’ మేకర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా వాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ మూవీ క్లైమాక్స్‌లో యంగ్ టైగ‌ర్ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో పంజా విస‌ర‌బోతున్నాడంటూ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. జూనియ‌ర్.. ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు లీక్స్ అందుతున్నాయి. జూనియ‌ర్‌ ‘అదుర్స్, ఆంధ్రావాలా, నా అల్లుడు’ చిత్రాల్లో డ్యూయల్ రోల్‌లో నటించాడు. ఆ సినిమాల్లో యంగ్ టైగ‌ర్ డ‌బుల్ ఫెర్ఫార్మెన్స్ చూసిన ఫ్యాన్స్‌.. దేవ‌ర మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మ‌రి.. ఇన్ని భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌వుతున్న దేవ‌ర ఎలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందిస్తుందో వేచి చూడాల్సిందే..